ఎట్ట‌కేల‌కు రోబో గాళ్ నిశ్చితార్థం

Update: 2019-05-06 15:12 GMT
లండ‌న్ బ్యూటీ ఎమీజాక్స‌న్ బిజినెస్ మ్యాగ్నెట్ జార్జి ప‌నాయ‌టౌతో ప్రేమాయ‌ణం సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ జంట షికార్ల గురించి అంత‌ర్జాతీయంగా ఎన్నో ఆస‌క్తిక‌ర క‌థ‌నాలొచ్చాయి. 2019 ఆరంభ‌మే కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఎమీజాక్స‌న్ త‌మ మ‌ధ్య అనుబంధం గురించి రివీల్ చేసింది. త‌మ‌కు ఆల్మోస్ట్ నిశ్చితార్థం పూర్త‌యిన‌ట్టేన‌న్న సంకేతాన్ని ఓ సింబ‌ల్ ద్వారా రివీల్ చేసింది. ప్రియుడు జార్జి ప‌నాయ‌టౌతో అధికారికంగా పెళ్లి జ‌ర‌గ‌లేదు త‌ప్ప ఆల్మోస్ట్ తామిద్దరం ఒక‌టైన‌ట్టేన‌ని సంకేతాలు ఇచ్చింది.

అయితే అప్ప‌టి నుంచి ఎమీ- జార్జి వ్య‌వ‌హారికంపై ర‌క‌ర‌కాల క‌థ‌నాలొచ్చాయి. ఈ జంట నిశ్చితార్థం ఎప్పుడు?  పెళ్లికి రెడీ అవుతున్నారా లేదా? అంటూ ఒక‌టే ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర కొన‌సాగింది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌రైన ఆన్స‌ర్ లేదు. వీట‌న్నిటికీ స‌మాధానం ఇదిగో అంటూ ఎమీజాక్స‌న్ స‌డెన్ ట్విస్టిచ్చింది. ఇటీవ‌లే త‌న‌ బేబి బంప్ ని ప్ర‌ద‌ర్శించి షాకిచ్చింది. త్వ‌ర‌లో తాము త‌ల్లిదండ్రులం కాబోతున్నామ‌ని ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇటీవ‌ల‌ ఎమీ బేబి బంప్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ ఆనంద స‌మ‌యంలోనే ఎమీజాక్స‌న్ నిశ్చితార్థం అంటూ నేడు మ‌రో ట్విస్టిచ్చింది. నేడు లండ‌న్ లో బంధుమిత్రుల స‌మ‌క్షంలో ఎమీ- జార్జి జంట నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది.

ఈ జోడీ నిశ్చితార్థానికి సంబంధించిన పార్టీ ఎంతో గ్రాండ్ గా హై ఎండ్ లో జ‌రిగిందిట‌. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోల్లో ఫ‌న్ అభిమానుల్ని ఆక‌ట్టుకుంటోంది. ఇక నిశ్చితార్థం పూర్త‌యింది కాబ‌ట్టి ఎమీ జాక్స‌న్ - జార్జి జోడీ పెళ్లికి సిద్ధ‌మైన‌ట్టే. కార్పొరెట్ వ‌ర‌ల్డ్ సాక్షిగా ది బెస్ట్ గా ఈ వివాహం ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఇక పెళ్లి త‌ర్వాత అయినా ఎమీ తిరిగి సినిమాల్లో న‌టిస్తుందా..? అన్న‌ది తెలియాల్సి ఉంది. తెలుగు-తమిళ- హిందీ లో ఎమీజాక్స‌న్ పాపులారిటీ అసాధార‌ణం. 2.0 త‌ర్వాత అది మ‌రింత‌గా పెరిగింది. ఈలోగానే ఇలా ప్రేమ‌- పెళ్లి అంటూ వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల‌తో బిజీ అయిపోయింది.

    

Tags:    

Similar News