ర‌ష్మిక కాలి గాయం ఎంత ప‌ని చేసింది!

దానికి కార‌ణ‌మేమిటో ర‌ష్మిక తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోగ్రాఫ్ చూస్తేనే అర్థ‌మ‌వుతోంది. చూడ‌గానే.. అరే ర‌ష్మిక‌కు ఏమైంది? కాలు ఏమైనా విరిగిందా? అంటూ సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Update: 2025-01-11 16:58 GMT

వ‌రుస చిత్రాల‌తో గ‌త ఏడాది అంతా బిజీ బిజీగా ఉంది ర‌ష్మిక మంద‌న్న‌. ఇటీవ‌లే విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన 'పుష్ప 2' విజ‌యాన్ని ఆస్వాధిస్తూనే, వ‌రుసగా సెట్స్ పై ఉన్న సినిమాల‌ను పూర్తి చేస్తోంది. సికందర్, థామ, కుబేర చిత్రాల కోసం ర‌ష్మిక లొకేష‌న్లు షిఫ్ట‌వుతూనే ఉంది.

 

అయితే అనూహ్యంగా ఇంత బిజీలోనూ ఊహించ‌ని ట్విస్టు ఎదురైంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న‌ సినిమాల‌ నిర్మాతలు ర‌ష్మిక తేదీలను రీషెడ్యూల్ చేయాల్సిన ప‌రిస్థితి. దానికి కార‌ణ‌మేమిటో ర‌ష్మిక తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోగ్రాఫ్ చూస్తేనే అర్థ‌మ‌వుతోంది. చూడ‌గానే.. అరే ర‌ష్మిక‌కు ఏమైంది? కాలు ఏమైనా విరిగిందా? అంటూ సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

 

రష్మిక మందన్న కాలికి గాయ‌మైంది. జిమ్ లో క‌స‌ర‌త్తులు చేస్తుండ‌గా గాయానికి గురైన పాదం ఫోటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ''సరే... నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు! నా పవిత్ర జిమ్ మందిరంలో నన్ను నేను గాయపరచుకున్నాను. ఇప్పుడు నేను రానున్న‌ కొన్ని వారాలు లేదా నెలలు 'హాప్ మోడ్'లో ఉన్నాను.. దేవుడికి మాత్రమే తెలుసు.. కాబట్టి నేను థామ, సికందర్, కుబేర కోసం సెట్‌లకు తిరిగి వెళ్తున్నట్లు అనిపిస్తుంది! నా దర్శకులను అడుగుతున్నాను.. ఈ ఆలస్యానికి క్షమించండి... నా కాళ్ళు యాక్షన్‌కి (లేదా కనీసం దూకడానికి) సహ‌క‌రించేలా చూసుకుని త్వరలోనే తిరిగి వస్తాను'' అని వ్యాఖ్యానించింది. ఈలోగా మీకు నా అవసరం ఉంటే... నేను చాలా అధునాతనమైన బన్నీ హాప్ వర్కౌట్ చేస్తూ మూలలో ఉంటాను. హాప్ హాప్ హాప్..! అని కూడా ఛ‌మ‌త్క‌రించింది.

స‌ల్మాన్‌తో 'సికందర్' చివరి షెడ్యూల్ జనవరి 10న ముంబైలో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ర‌ష్మిక‌ గాయం కారణంగా షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేసారు. సికందర్ 2025 ఈద్ సందర్భంగా విడుదలవుతుంది. దీనిని AR మురుగదాస్ దర్శకత్వం వహించారు. సాజిద్ నదియాద్వాలా నిర్మించారు. ఆయుష్మాన్ ఖురానాతో 'థామా' కూడా సెట్స్‌లో ఉంది. ఈ చిత్రం మాడాక్ సూపర్‌నేచురల్ యూనివర్స్‌లో భాగం. వాంపైర్ల చుట్టూ తిరిగే క‌థాంశంలో ర‌ష్మిక న‌టించింది. ఈ సంవత్సరం దీపావళికి విడుదల అవుతుంది. ధనుష్‌తో కలిసి నటించిన 'కుబేర' కూడా 2025 లో విడుదల అవుతుంది. దీనితో పాటు రష్మిక నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' ఈ సంవత్సరం కీల‌క‌ చిత్రాలలో ఒకటి.

Tags:    

Similar News