ఫొటోస్టోరీ: 2.O గాళ్ జీవితం త‌ల‌కిందులు!

Update: 2020-09-15 05:00 GMT
వ‌న్నె త‌ర‌గ‌ని అందం బ్రిటీష్ బ్యూటీ ఎమీ జాక్స‌న్ సొంతం. లండ‌న్ బాబు జార్జి ప‌నాయ‌టౌని పెళ్లాడి బిడ్డ‌కు తల్ల‌యినా ఎమీని చూసిన ఎవ‌రైనా చేసే ఒకే ఒక్క కామెంట్ .. సూప‌ర్ గాళ్  2.0. ఫ్రెగ్నెన్సీ త‌ర్వాత ఫీడింగ్ మామ్ అయ్యాక కూడా ఎమీ లో ఏ మార్పూ లేదు. బిగిస‌డ‌ల‌ని అందాలు ఆమె సొంతం. రూప‌లావ‌ణ్యంలో ఎలాంటి మార్పు క‌నిపించ‌డం లేదు. ఓ బిడ్డ‌కు త‌ల్లి అన్న భావ‌న యూత్ కి ఎక్క‌డా క‌నిపించదు. సూప‌ర్ హాట్  మోడ‌ల్ ‌లా ఇప్ప‌టికీ క‌వ్విస్తూనే ఉంది. వ‌న్నె త‌గ్గ‌ని అందాల‌ తో బ్రిట‌న్ నుంచి ఇండియా టూర్ కి రెడీ అవుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఈసారి కూడా ఫిల్మిండ‌స్ట్రీ లో మ‌రో రౌండ్ షేక్ చేయ‌డానికి రెడీ అయిందా అన్న‌ట్టు గా క‌నిపిస్తోంది.

అమెరికన్ టీవీ సిరీస్ ల‌లో ఎమీ సూప‌ర్ గాళ్ పాత్ర‌లో న‌టించ‌నుంది. ఇక ఇటు ఇండియా లో అడుగు పెడితే ఆమె అందానికి ముగ్ధుడై పోయి శంక‌ర్ `2.O`కు సీక్వెల్ తీస్తానంటాడేమో..అన్నంత‌ అందం గా ఎమీ జాక్స‌న్ త‌యార‌వ‌డం అబ్బుర ప‌రుస్తోంది. ఒక‌వేళ అదే జ‌రిగితే .. ఏజ్ అయిపోయిన‌ ర‌జ‌నీ కాంత్ మ‌ళ్లీ సీక్వెల్లో న‌టించే ఛాన్సుందో లేదో కానీ.. ఎమీకి మాత్రం శంక‌ర్ ఆఫ‌ర్ ఖాయ‌మే.

వార‌సురాలిని క‌న్న త‌ర్వాతా.. ఎమీ రెట్టించిన ఉత్సాహంతో రెగ్యుల‌ర్ గా జిమ్మింగ్ చేస్తూ మాంచి రైజింగ్ లో వుంటోంది. బ్రిట‌న్ కు చెందిన బిజినెస్ టైకూన్ జార్జ్ పనయోటౌతో క‌లిసి షికార్లు చేస్తోంది. త్వ‌ర‌లోనే అత‌డిని పెళ్లాడేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇక పెళ్లికి ముందే ఎమీ అత‌ని ఆస్తుల‌న్నింటికీ ఓ వార‌సుడిని క‌నిచ్చేసింది. మ‌రోసారి ఎమీ సినిమాల్లో త‌న స‌త్తా చాటాల‌నుకుంటోందా? అందుకేనా ఈ క‌స‌ర‌త్తు? పెళ్లి త‌రువాత ఎమీ ప‌ని అయిపోయింది అనుకునే వారికి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోందా?.. అంటే. తాజాగా ఇన్ ‌స్టా గ్రామ్ ‌లో ఎమీ షేర్ చేసిన సూప‌ర్ హాట్ ఫిక్స్ ఎమీ ప్లానింగ్స్ కి ప్ర‌త్య‌క్షంగా అద్దం ప‌డుతున్నాయి.
Tags:    

Similar News