'నాది పర్ఫెక్ట్ బికినీ బాడీ' అంటూ పబ్లిక్ గా చెప్పగలిగే ధైర్యం ఉన్న ఒకే ఒక్క సొగసరి యామీ జాక్సన్. ఈ ఇంగ్లండ్ అందం ఇండియాలో బాగానే వెలిగిపోతోంది. బికినీ ఫోటోలతో జనాలను తెగ రెచ్చగొట్టడం ఈ భామకు బోలెడంత సరదా ప్లస్ పర్సనల్ ఇష్టం కూడా.
ఇప్పటికే సినిమాల్లో తెగ వెలిగిపోతున్న యామీ జాక్సన్.. ఇప్పుడు కొత్త వ్యాపారం మొదలుపెట్టేస్తోంది. తనకు ఎంతగానో పేరు తెచ్చి పెట్టిన బికినీలతోనే ఈ బ్యూటీ బిజినెస్ స్టార్ట్ చేసేస్తుండడం విశేషం. టూర్లు తిరగడం అంటే మహా ఇష్టపడే ఈ భామ.. రీసెంట్ గా సమ్మర్ లో ఇలాంటి షికార్లే కొట్టింది. ఆ సమయంలో ఈమెకు నచ్చినట్లుగా బికినీ వేర్ దొరకలేదట. అప్పుడు వచ్చిన ఐడియాను పట్టుకుని.. వ్యాపారం ఆలోచన చేసిందట. ప్రస్తుతానికి ఈ కాన్సెప్ట్ ఇంకా మేకింగ్ లోనే ఉన్నా.. త్వరలోనే యామీ అమ్మే బికినీలు మార్కెట్లోకి వచ్చేయడం ఖాయమే. వీటిలో కవర్-అప్స్.. బికినీలు.. సింగిల్ పీస్ కాస్ట్యూమ్స్ ఉంటాయంటోంది యామీ.
పైగా వీటిని చవకధరల్లోనే విక్రయిస్తామని యామీ జాక్సన్ చెబుతుండడం విశేషం. 'తనకు ఏది తగిన డ్రెస్ అనే విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రతీ మహిళకు ఉంది. నగ్నంగా తిరగాలని కోరుకున్నా అది వారి వ్యక్తిగత ఇష్టమే. ఎవరూ ప్రశ్నించడానికి.. జడ్జ్ చేయడానికి అవకాశం లేదు. బట్టలు ఒకరి కోసం వేసుకునేవి కావు.. వారి కంఫర్ట్ కోసం వేసుకుంటారు. వ్యక్తిగత ఇష్టమే ఎలాంటి దుస్తులు వేసుకోవాలనే అంశాన్ని నిర్ణయించాలి' అంటూ స్ట్రాంగ్ క్లాస్ పీకినట్లుగా చెప్పింది యామీ జాక్సన్.