మంజుల దర్శకత్వంలో సందీప్ కిషన్ సరసన కథానాయికగా నటించిన అమైరా దస్తూర్ ఆ తర్వాత బాలీవుడ్ లో కొన్ని అవకాశాలు అందుకుంది. అక్కడ ఇమ్రాన్ హస్మి.. ప్రతీక్ బబ్బర్ లాంటి స్టార్ల సరసన నటించింది ఈ భామ. ప్రస్తుతం ఓ మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఊడి ఊది ఉజికానుమ్ ..కాధలై తేడి నిత్య నంద అనే రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. పిల్ ఫర్ సింగ్ అనే హిందీ చిత్రంలోనూ నాయికగా నటిస్తోంది. ఇటీవలే భగీరా అనే చిత్రంలోనూ అవకాశం అందుకుంది. ఈ సినిమాలో ప్రభుదేవా ఐదు గెటప్పులతో సర్ ప్రైజ్ చేయబోతున్నారు. ఇందులో అమీరా దస్తూర్ పాత్ర ఆసక్తికరంగా ఉండనుందిట. ఇంతకుముందు రిలీజ్ చేసిన భగీరా టీజర్ ఆసక్తిని పెంచింది.
అమైరా ఇటీవల సోషల్ మీడియాల్లో ఇతర నాయికలకు ధీటుగా వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. ఈ బ్యూటీ పోస్టులు అభిమానుల్లో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా మాల్దీవుల విహారం నుంచి వేడెక్కించే ఫోటోషూట్ ని షేర్ చేయగా అది వైరల్ గా మారింది. వాటర్ బేబీ అమైరా తన మాల్దీవుల సెలవుల నుండి తిరిగి నగరానికి వచ్చారు. అనంతరం ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో వరుస ఫోటోలు దర్శనమిస్తున్నాయి. బీచ్ ఇసుకలో అమైరా ఫోటోషూట్ హీటెక్కిస్తోంది. వారాంతాల్లో ప్రత్యేకంగా శనివారాలు గడపడానికి మాత్రమే మార్గం ఉంది అంటే.. సముద్రంలో.. ఇసుకలో పాదాలు కదుపుతూ.. ముఖం మీద సూర్యుని కాంతిని ప్రసరిస్తుంటే దానిని ఆస్వాధించాలి! అంటూ క్యాప్షన్ ని ఇచ్చింది. అమైరా యానిమల్ ప్రింటెడ్ బికినీ లుక్ లో ఆకట్టుకుంటోంది. తన వెనుక విశాలమైన బీచ్.. సముద్రపు నీరు .. కాళ్ళపై ఇసుకతో తన వెకేషన్ మూడ్ ని ఆవిష్కరిస్తోంది.
అమైరా పెద్ద టోపీని ధరించి సూర్య తాపం నుంచి తనని తాను బయటపడేసేందుకు ప్రయత్నిస్తోంది. గడ్డితో చేసిన టాన్ టోపీ ఆమె చిత్రానికి మొత్తం వెకేషన్ వైబ్ ఇచ్చింది. డిజైనర్ హౌస్ ఫ్యాన్సీ ప్యాంటు అధికారిక వెబ్ సైట్ లో ఈ టోపీ ధర రూ.2450. మిడ్ రిఫ్-బేరింగ్ బికినీలో మినిమల్ మేకప్ లో అమైరా ఫోటోలకు పోజులిచ్చింది. పింక్ షేడ్ లిప్ స్టిక్ తో అందంగా అలంకరించుకుంది. సినిమాల్లేకపోయినా ఇటీవల వెకేషన్స్ కి మాత్రం కొదవే లేదు ఈ అమ్మడికి.