కమెడియన్ గా వెన్నెల సినిమాతో పరిచయం అయిన కిషోర్.. ఆ తర్వాత వెన్నెల కిషోర్ అయ్యాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్న వెన్నెల కిషోర్ కు హీరోగా ఆఫర్లు వస్తున్నాయి కాని ఆయన మాత్రం ఆసక్తి చూపించడం లేదు. కాని దర్శకుడిగా కిషోర్ సక్సెస్ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. కమెడియన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే జఫ్ఫా సినిమాను చేశాడు. బ్రహ్మానందంతో వెన్నెల కిషోర్ జఫ్ఫా సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా ఎందుకు ప్లాప్ అయ్యిందో తనకు అర్థం కాదని.. చాలా మంది సినిమాలో మంచి కామెడీ సీన్స్ ఉన్నాంటూ కితాబిచ్చారు అంటూ వెన్నెల కిషోర్ గతంలో పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. జఫ్ఫా ప్లాప్ అయిన తర్వాత వెన్నెల టైటిల్ తో ఒక సినిమాను చేశాడు. ఆ సినిమా కూడా నిరాశ పర్చింది.
దర్శకుడిగా సక్సెస్ దక్కించుకోవాలనే కోరిక వెన్నెల కిషోర్ లో బలంగా ఉన్నా కూడా నటుడిగానే బిజీ అయ్యాడు. ఎట్టకేలకు మళ్లీ దర్శకత్వం చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఆహా ఓటీటీ కోసం వెన్నెల కిషోర్ ఒక వెబ్ కంటెంట్ ను తెరకెక్కించేందుకు సిద్దం అవుతున్నాడట. నటుడిగా సక్సెస్ అయిన వెన్నెల కిషోర్ దర్శకుడిగా సక్సెస్ అవ్వాలని చూపిస్తున్న పట్టుదల మరియు ఆయన ఉత్సాహం చూస్తుంటే ఈసారి ఆహా అనిపించే ఓటీటీ కంటెంట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
తెలుగులో ప్రస్తుతం ఓటీటీ కంటెంట్ కు మంచి డిమాండ్ ఉంది. కనుక ఖచ్చితంగా వెన్నెల కిషోర్ కాస్త మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తే దర్శకుడిగా మంచి పేరు దక్కించుకోవడం ఖాయం. తద్వార మెయిన్ స్ట్రీమ్ హీరోలు మరియు పెద్ద బ్యానర్ లు కూడా వెన్నెల కిషోర్ కు దర్శకుడిగా నమ్మకంగా పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకే పట్టు వదలని విక్రమార్కుడి తరహాలో రెండు ప్లాప్ లు అయినా కూడా దర్శకుడిగా మూడవ ప్రయత్నం మొదలు పెట్టబోతున్నాడు. ఈ విషయంలో వెన్నెల కిషోర్ ను పట్టువదలని కిషోరుడుగా మెచ్చుకోవచ్చు.