దేవరకొండ బ్రదర్స్.. ఒకరు ఓటీటీ, మరొకరు థియేటర్!

Update: 2022-08-07 15:30 GMT
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ మొదటి సినిమాతో కాస్త భారీ స్థాయిలోనే సక్సెస్ అందుకోవాలని అనుకున్నాడు. తమ్ముడి మొదటి సినిమా సక్సెస్ కావాలి అని విజయ్ దేవరకొండ బాగానే ప్రయత్నాలు చేశాడు. కొత్త దర్శకుడి మీద నమ్మకంతో చేసిన దొరసాని సినిమా ఏ మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఇక తర్వాత పెద్దగా అంచనాలు లేకుండా మంచి కంటెంట్ ఉన్న ఎమోషనల్ డ్రామా తో మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా తీశాడు.

ఆ సినిమా కరోనా పరిస్థితిల వలన ఓటీటీ లోనే విడుదలైంది. కానీ ఆ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తర్వాత పుష్పక విమానం అనే సినిమాతో ఆకట్టుకోవాలి అని బాగానే ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ సినిమా ధియేటర్లో ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు నాలుగవ సినిమా హైవేతో అతను బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంటాడు అనుకుంటే ఆ అవకాశం లేకుండా పోయింది.

ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమాకు ఎంతో హైప్ క్రియేట్ అయితే కానీ జనాలు థియేటర్లోకి రావడం లేదు. ఇక ఎప్పుడో మొదలుపెట్టిన హైవే సినిమాము ఇప్పటివరకు కూడా అసలు షూటింగ్ జరుపుకుంటున్న విషయం కూడా ఎవరికీ తెలియదు. దీంతో రిస్క్ చేయడం ఎందుకని హైవే సినిమాను ఓటీటీ లోనే విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.

విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కంటే ఒక వారం ముందే హైవే సినిమా ఓటీటీ లో రాబోతోంది. విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆగస్టు 25వ తేదీన విడుదలవుతుండగా అంతకంటే ముందు ఒక వారం ఆగస్టు 19వ తేదీన ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ రెండు సినిమాలతో దేవరకొండ బ్రదర్స్ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటారో చూడాలి. ఇక ఆనంద్ దేవరకొండ లిస్టులో బేబీ, గం గం గణేష్ అనే మరో సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
Tags:    

Similar News