సినీ ప‌రిశ్ర‌మ‌లో ఆనందయ్య మందు పంపిణీ

Update: 2021-06-23 11:58 GMT
తెలంగాణ‌లో లాక్ డౌన్ ముగిసింది. త్వ‌ర‌లో సినిమా షూటింగులు సైతం ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో కరోనా నియంత్ర‌ణ కోసం నిర్మాణ సంస్థ‌లు త‌మ సిబ్బందికి వ్యాక్సినేష‌న్ నిర్వ‌హిస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో తెలుగు ఫిల్మ్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ లో కృష్ణ‌ప‌ట్నం ఆనంద‌య్య మందును పంపిణీ చేశారు.

ఫిల్మ్ ఛాంబ‌ర్ ప‌రిధిలోని నాలుగు సెక్టార్ల‌కు చెందిన స‌భ్యుల‌కు కార్యాల‌య సిబ్బందికి, సినీ జ‌ర్న‌లిస్టుల‌కు బుధ‌వారం ఆనంద‌య్య మందును పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఛాంబ‌ర్ మెంబ‌ర్, నిర్మాత ఇస‌నాక సునీల్ రెడ్డి మాట్లాడుతూ... క‌రోనాకు మందు ఇస్తున్న ఆనంద‌య్య‌తో త‌న‌కు ప‌రిచ‌యం ఉంద‌ని, ఈ క్ర‌మంలోనే ఫిల్మ్ ఛాంబ‌ర్ పెద్ద‌ల‌ను సంప్ర‌దించి, ఆనంద‌య్య మందును తెప్పించిన‌ట్టు చెప్పారు.

సుమారు 700 మంది వ‌ర‌కు ఈ మందును అందిస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. ఇంకా అవ‌స‌రం ఉంటే.. తీసుకొచ్చేందుకు సిద్దంగా ఉన్న‌ట్టు తెలిపారు. ప్రొడ్యూస‌ర్ సెక్టార్ కౌన్సిల్ చైర్మ‌న్‌, నిర్మాత సురేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇక్క‌డి వారు అడుతున్నార‌నే ఈ మందు తెప్పించామ‌ని అన్నారు. ఆనంద‌య్య మందువ‌ల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేద‌ని నిరూప‌ణ అయ్యింద‌ని, క‌రోనా రాకుండా ముంద‌స్తుగా వేసే మందును మాత్ర‌మే తాము పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు. కొవిడ్ పాజిటివ్‌ వ‌చ్చిన వారికే వేసే మందు ఇవ్వ‌ట్లేద‌ని తెలిపారు.




Tags:    

Similar News