హార్రర్ సినిమాలు చూశాం.. హార్రర్ కామెడీలు చూశాం.. వీటన్నింట్లో కామన్ గా కనిపించే పాయింట్ దయ్యాల్ని చూసి మనుషులు భయపడటం. ఐతే మనుషులే దెయ్యాల్ని భయపెట్టడం ఎప్పుడైనా చూశామా? ఇలాంటి వెరైటీ కాన్సెప్ట్ తో ఓ సినిమా తెరకెక్కుతోంది. అదే.. ‘ఆనందో బ్రహ్మ’. తాప్సి ప్రధాన పాత్రలో ‘పాఠశాల’ ఫేమ్ మహి.వి.రాఘవ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. రెండు రోజుల కిందట రిలీజైన ‘ఆనందో బ్రహ్మ’ మోషన్ పోస్టర్ భలే ఆసక్తిని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కాన్సెప్ట్ గురించి చిత్ర యూనిట్ చెబుతున్న సంగతులు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
దెయ్యాలకి.. మనుషులకి మధ్య జరిగే ఘర్షణలో.. దెయ్యాల్ని భయపెట్టి మనుషులు చివరికి ఎలా గెలుస్తారనే వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని.. ఇప్పటిదాకా వచ్చిన హార్రర్ కామెడీలతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుందని... ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ సాగుతుందని చిత్ర బృందం తెలిపింది. ‘భలే మంచి రోజు’ లాంటి వైవిధ్యమైన చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టిన ‘70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్’ అధినేతలు విజయ్ చిల్లా.. శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి తాప్సి మాట్లాడుతూ.. ‘‘నాకు చాలా రోజుల క్రితం ఈ కథ చెప్పారు. చాలా బాగా అనిపించింది. నాకు కూడా తెలుగులో మంచి హిట్ కావాలి. అందుకే ఈ చిత్రం చేస్తానని నిర్మాతలకు చెప్పాను. ఇది కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్. ఇందులో ఎవరూ హీరో కాదు. ఎవరు హీరోయిన్ కాదు. కాన్సెస్టే హీరో. తెలుగులో కచ్చితంగా నాకు ఇది మంచి హిట్ గా నిలుస్తుంది’’ అని చెప్పింది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/