త్రివిక్రమ్ సినిమాలో ఇంకో హీరోయిన్

Update: 2015-10-11 03:30 GMT
త్రివిక్రమ్ కొత్త సినిమా ‘అ..ఆ’లో లేడీ క్యారెక్టర్ లకు బాగానే ప్రాధాన్యం ఉన్నట్లుంది. ఇందులో సమంత హీరోయిన్ కాగా.. మలయాళ బ్లాక్ బస్టర్ ‘ప్రేమమ్’ ఫేమ్ అనుపమ పరమేశ్వర్ రెండో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటి నదియా కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. కాగా ఇప్పుడు మరో హీరోయిన్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. ఆమె ఎవరో కాదు.. ‘జర్నీ’ సినిమాతో తమిళ - తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన అనన్య. ఐతే సినిమాలో అనన్య హీరోయిన్ కాదు. ఆమె నితిన్ సిస్టర్ గా నటిస్తోందట. ఐతే కథను మలుపు తిప్పే పాత్ర ఆమెదని తెలిసింది.

జర్నీ తర్వాత తెలుగులో అనన్యకు బాగానే అవకాశాలొచ్చాయి. అమాయకుడు అనే సినిమాతో పాటు కొత్త హీరో రేవంత్ సరసన ‘ఇంటింటా అన్నమయ్య’ అనే సినిమా చేసింది. ఐతే అమాయకుడు విడుదలైన సంగతి కూడా చాలామందికి తెలియలేదు. ఇక ఇంటింటా అన్నమయ్య అయితే విడుదలకే నోచుకోలేదు. ‘జర్నీ’ తర్వాత తమిళంలో హీరోయిన్ గా మంచి స్థితిలో ఉండగా.. సడెన్ గా ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది అనన్య. ఐతే అతను రెండో పెళ్లి వాడని.. మొదటి పెళ్లిని దాచి పెట్టి అనన్యను పెళ్లి చేసుకున్నాడని వెల్లడైంది. అయినప్పటికీ అనన్య అతణ్ని మన్నించి తనతోనే కంటిన్యూ అయింది. రెండు మూడేళ్లు సినిమాల నుంచి దూరంగా ఉన్న అనన్య.. ఇప్పుడు రీఎంట్రీకి రెడీ అవుతోంది.
Tags:    

Similar News