ఎన్సీబీ విచారణకు హాజరు కాని అనన్య పాండే

Update: 2021-10-25 10:30 GMT
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కి సంబంధించిన డ్రగ్స్ కేసులో ఈరోజు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు నటి అనన్య పాండే హాజరు కావడం లేదు. వృత్తిపరమైన పనులు ఉన్నాయని పేర్కొంటూ యాంటీ-డ్రగ్ ఏజెన్సీ సమన్లకు సమాధానం ఇవ్వడానికి మరింత సమయం కావాలని అనన్య కోరింది. అనన్య ఈ రోజు వచ్చి ఉంటే, ఒక వారం లోపు ఇది మూడవసారి కావడం గమనార్హం.

ఆర్యన్ ఖాన్ ఫోన్‌లో రెండేళ్ల వాట్సాప్ చాట్‌ల ఆధారంగా అనన్య పాండేకు ఎన్సీబీ మొదట సమన్లు పంపింది. వీటి వివరాలను యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ అంతకుముందు లీక్ చేసింది. ఆమె సమాధానాలు సంతృప్తికరంగా లేనందున ఆమెను మళ్లీ పిలిచినట్లు ఏజెన్సీ వర్గాలు సూచించాయి. ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఆమె ఇంటిపై కూడా ఎన్‌సిబి దాడి చేసింది. ఆమె ఫోన్ , ల్యాప్ ట్యాప్ ను ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది.

అనన్య పాండేని ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే ప్రశ్నిస్తున్నారు - విచారణకు నాయకత్వం వహిస్తున్నారు. 2018-19లో అనన్య మూడుసార్లు ఆర్యన్‌కు సహాయం చేసిందని సూచించే చాట్‌లపై ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. మొబైల్ ఫోన్ సంభాషణలలో డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఉందన్న ఆరోపణలను అనన్య ఖండించింది. ఆమె ఎన్నడూ నిషేధిత మాదకద్రవ్యాలను వినియోగించలేదని స్పష్టం చేసింది. తాను సరఫరా చేయలేదని ఎన్సీబీ అధికారులకు చెప్పింది. అనన్యపాండేని గత వారం రెండు వేర్వేరు సందర్భాలలో మొత్తం ఆరు గంటల పాటు ప్రశ్నించారు.

ఒక ఎన్సీబీ అధికారి మాట్లాడుతూ, ఏజెన్సీ ఈ దశలో అనన్యను "విచారణలో భాగం" కాకుండా కుట్రదారుగా పరిగణిస్తోందని.. ఆమెకు సమన్లు పంపబడినందున ఆమె అనుమానితురాలు అని అర్థం కాదు" అని చెప్పారు.

ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌పై ఎన్సీబీ అధికారులు దాడి చేశారు. ఈ డ్రగ్స్ దాడి లో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు. అతడిని అదుపులోకి తీసుకున్న ఒక రోజు తర్వాత, ఆర్యన్ ఖాన్ -మరికొంత మందిని అక్టోబర్ 3న అరెస్టు చేశారు. ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ కనుగొనబడలేదు. ఈ కేసు పూర్తిగా అతని వాట్సాప్ చాట్‌ల నుంచి వచ్చిన సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఆర్యన్ అంతర్జాతీయ డ్రగ్స్ కార్టెల్‌తో టచ్‌లో ఉన్నాడని ఈ చాట్‌లు సూచిస్తున్నాయని ఏజెన్సీ పేర్కొంది. ఆర్యన్ లాయర్లు డ్రగ్స్ దొరకలేదని.. వినియోగానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని నొక్కి చెబుతూ ఆర్యన్ కు బెయిల్ ఇవ్వాలని వాదిస్తున్నారు.

నేటి యువకుల మధ్య జరిగే సాధారణ సంభాషణలు పాత తరాలకు అర్థం కాని యాసలు, వ్యావహారికాలు లేదా ఇడియమ్‌లను పట్టుకొని డ్రగ్స్ కు అంటగట్టవద్దని న్యాయవాదులు కూడా సూచించారు.

నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే 2019లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. హిందీ చిత్ర పరిశ్రమలో పెరుగుతున్న యువ తరం తారలలో ఒకరు. ప్రస్తుతం ఈ కేసులో అనన్య పీకల్లోతు మునిగిపోయింది.


Tags:    

Similar News