ఫోటో స్టోరీ : లైగర్ బ్యూటీ మనసు లాగేస్తుంది..!

Update: 2022-11-04 12:30 GMT
బాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్ ఎవరంటే అందరు చెప్పే పేరు ఒక్కటే ఆమె అనన్యా పాండే. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 సినిమాతో తెరంగేట్రమే హిట్ అందుకున్న అనన్యాకి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. అదే ఊపుతో అమ్మడు వరుస సినిమాలు చేస్తూ వస్తుంది.

చేసిన నాలుగైదు సినిమాలు.. ఓ వెబ్ సీరీస్ తోనే అనన్యా పాండే టాప్ లీగ్ లో చేరింది. బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా అమ్మడి పేరు వినిపిస్తుంది. విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైంది అనన్యా పాండే. పాన్ ఇండియా రిలీజైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు.

అమ్మడి లిస్ట్ లో ఇప్పుడు ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయి. ఆల్రెడీ అన్ని క్రేజీ ప్రాజెక్ట్ లనే చెప్పొచ్చు. ఇక సినిమాలే కాదు తన రెగ్యులర్ అప్డేట్స్ తో సోషల్ మీడియాలో కూడా హడావిడి చేస్తుంది అనన్యా పాండే.

అమ్మడు తన క్యాజువల్ లుక్స్ తో పాటుగా హాట్ ఫోటో షూట్స్ ని కూడా అక్కడ షేర్ చేస్తుంది. లేటెస్ట్ గా చిరుతపులి తోలు లాంటి కాస్టూం తో కనిపించి అలరించింది లైగర్ భామ. తన లుక్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్న అనన్యా కాస్టూంస్ తో కూడా సెపరేట్ స్టైల్ మెయిన్ టైన్ చేస్తుంది.

సినిమాలతో పాటుగా ఫాలోవర్స్ ని కూడా అలరించాలని ఇలా గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. అనన్యా పాండే ఇన్ స్టాగ్రాం లో 24 మిలియన్ ఫాలోవర్స్ తో దూసుకెళ్తుంది. అతి తక్కువ కాలంలో ఈ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ అనన్యా మాత్రమే అని చెప్పొచ్చు. ఆమె సెలెక్ట్ చేసుకుంటున్న సినిమాలు కూడా ఒకదానికి మించి మరొకటి అనిపించేలా ఉన్నాయి. పాండే ఫ్యామిలీ నుంచి వచ్చిన అనన్యా తన కెరియర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటుంది.  

కేవలం గ్లామర్ మాత్రమే కాదు నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కూడా నటిస్తుంది. దీపికాతో నటించిన గెహ్రాయాన్ వెబ్ మూవీలో అనన్యాకి మంచి మార్కులే పడ్డాయి. బాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో టాప్ 3 పొజిషన్ లో ఉంటుంది దీపిక. మిగతా హీరోయిన్స్ అంతా ఒకవైపు అనన్యా పాండే మాత్రమే మరో వైపు అనిపించేలా ఆమె సినిమాలు ఉంటున్నాయి. ఇదే జోష్ తో బాలీవుడ్ లో అమ్మడు టాప్ 1కి వెళ్లాలని ఆశిస్తున్నారు ఆమె ఫ్యాన్స్.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News