నాది ఫేక్ అడ్మిషన్ అంటారా.. అంటారా??

Update: 2019-06-10 07:56 GMT
ఇదో మాయాలోకం.  కొందరు తమకు లేని డిగ్రీలు ఉన్నాయని చెప్పుకుంటారు. కొందరేమో అసలు ప్రపంచంలో ఇంతవరకూ ఎవ్వరూ చదవని డిగ్రీలు చదివామని అంటారు. పాత కాలం వాళ్ళు కొందరు ఈ కొత్త జెనరేషన్ డిగ్రీలకు అసలు విలువే లేదంటారు.  వీటితో సంబంధం లేకుండా డిగ్రీ విలువ డిగ్రీదే.  డిగ్రీ వరకూ ఎందుకు.. దానికి వచ్చే అడ్మిషన్ కు కూడా ఎంతో వ్యాల్యూ ఉంటుంది.  దాని చుట్టూ ఎంతో హంగామా జరుగుతుంది.  రీసెంట్ గా అనన్య పాండే విషయంలో అదే జరిగింది.

అనన్య తెలుసు కదా.. సీనియర్ బాలీవుడ్ హీరో చుంకీ పాండే గారాలపట్టి.  ఈమధ్యే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  ఈ సినిమాతో అనన్యకు మంచి పాపులారిటీ వచ్చింది.  ఒక ఇంటర్వ్యూ లో అనన్య తన చదువు గురించి మాట్లాడుతూ 12 వ తరగతి పూర్తి చేశానని..  తనకు అమెరికాలో రెండు యూనివర్సిటీలో జర్నలిజం గ్రాడ్యుయేషన్ కోర్సుకు అడ్మిషన్ లభించిందని తెలిపింది.  అయితే అనన్య ఫ్రెండ్ గా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి అనన్య చెప్పేదంతా అబద్ధమని.. ఫేక్ అడ్మిషన్ అని ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. మన జనాలకు నెగెటివిటీ అంటే వల్లమాలిన ప్రేమ కదా.. అందుకే ఆ పోస్ట్ వైరల్ అయింది. ఆ పోస్ట్ ను చూసిన చాలామంది నెటిజనులు అనన్య ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

దీంతో అప్సెట్ అయిన అనన్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా లో అనెన్ బర్గ్ స్కూల్ ఆఫ్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం లో కమ్యూనికేషన్స్ లో మేజర్ చేసేందుకు తనకు లభించిన అడ్మిషన్ లెటర్ ను పోస్ట్ చేసింది.  సుదీర్ఘమైన ఇన్స్టా పోస్ట్ లో తనకు ఇలా వివరణ ఇచ్చే ఉద్దేశం లేదని.. అయితే రూమర్లు రోజురోజుకు పెద్దవి అవుతూ ఉండడంతో క్లారిటీ ఇస్తున్నానని తెలిపింది.  దీనికి స్పందించిన అర్జున్ కపూర్ "అనన్య.. నీ కుటుంబ సభ్యులకు.. క్లోజ్ ఫ్రెండ్స్ కు నిజం తెలుసు కదా. అది చాలు.. ఈ జఫ్ఫాలను పట్టించుకోకు. జీవితంలో ముందుకు సాగిపో" అని మద్దతు తెలిపాడు.  అర్జున్ ఒక్కడే కాదు. చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు అనన్యకు మద్దతు తెలిపారు.

    

Tags:    

Similar News