మగాడిలా ఉన్నావంటూ ట్రోల్స్‌ చేశారు

Update: 2021-03-10 05:30 GMT
బాలీవుడ్‌ లో ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్స్ జాబితాలో అనన్య పాండే చేరింది. ప్రస్తుతం ఈమె యంగ్‌ స్టార్‌ హీరోలతో వరుసగా నటించే అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాల జాబితా చాలా పెద్దదే. ముందు ముందు ఈమె బాలీవుడ్ టాప్ స్టార్‌ హీరోయిన్స్ జాబితాలో చేరడం ఖాయం అంటూ ఇండస్ట్రీలో వర్గాల వారు అంటున్నారు. హీరోయిన్‌ గా వరుస ఆఫర్లతో బిజీ బిజీగా ఉన్న అనన్య పాండే ను కెరీర్ ఆరంభంలో బాడీ షేమింగ్ చేశారట. ఒకానొక సమయంలో తనపై తనకు నమ్మకం కోల్పోయేంతగా ట్రోల్స్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ఇటీవల అనన్య పాండే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్‌ ఆరంభంలో తనను మగాడిలా ప్లాట్‌ గా ఉన్నవాంటూ ట్రోల్‌ చేశారు. ఆ ట్రోల్స్ నన్ను మానసికంగా కృంగదీశాయి. కెరీర్‌ లో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాల్సిన సమయంలో నాకు ఆ ట్రోల్స్ ఇబ్బందిగా అనిపించాయి. ఆ సమయంలో నేను ఏమీ చేయలేనేమో అనేంతగా బలహీనురాలిగా మారిపోయేదాన్ని. కాని ఇప్పుడు అలాంటి ట్రోల్స్‌ ను నేను పట్టించుకోవడం లేదు. నాకు నేను గా మానసికంగా బలపర్చుకోవడంతో పాటు ట్రోల్స్ ను లైట్ తీసుకోవడం అలవాటు చేసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News