అసలు అనసూయకు పిలుపేం రాలేదు

Update: 2018-04-16 05:39 GMT
టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ రంగస్థలం మూవీలో రంగమ్మత్త పాత్రలో అదరగొట్టేసింది హాట్ బ్యూటీ అనసూయ. టీవీ యాంకర్ గా జబర్దస్ట్ షో ఆమెకు ఎంత పాపులారిటీ తెచ్చిందో మళ్లీ రంగమ్మత్త రోల్ అంత రేంజిలో పాపులర్ అయింది. ఈ రెస్పాన్స్ చూసి అనసూయ తెగ హ్యాపీగా ఫీలవుతోంది. ఇలాంటి ఆమెకు మెగా ఫ్యామిలీలో మరో సినిమా చేసే అవకాశం వచ్చిందనే న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.

మెగా స్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా.. నర్సింహారెడ్డిలో అనసూయ నటించనుందనేది లేటెస్ట్ టాక్. రంగస్థలం మూవీలో ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చడంతో హిస్టారికల్ మూవీలో ఆమెకు ఓ ఇంపార్టెంట్ రోల్ యూనిట్ ఆఫర్ చేసిందనే మాట వినిపించింది. కానీ ఇది నిజం కాదని స్వయంగా రంగమ్మత్తే క్లారిటీ ఇచ్చింది. ఇంతవరకు సైరా నర్సింహారెడ్డి మూవీ యూనిట్ నుంచి ఎవరూ తనకు కనీసం కాల్ చేసి కూడా మాట్లాడలేదని చెప్పింది. సైరా మూవీలో తాను నటిస్తున్నానంటూ వస్తున్నవన్నీ ఉత్త రూమర్లేనని తేల్చి చెప్పేసింది.

భారీ కాస్టింగ్ తో విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కుతున్న సైరా సినిమాలో నటించడం అంటే నిజంగా గొప్ప అవకాశమని.. ఒకవేళ యూనిట్ నుంచి తనకు ఆఫర్ వస్తే మాత్రం వదులుకోనని అనసూయ చెబుతోంది. మొత్తానికి అనసూయ తన మాటలతో మెగా అభిమానులను బాగానే మెప్పించింది.


Tags:    

Similar News