అనసూయ పక్కనున్న కొత్త వ్యక్తి ఎవరు? సంరక్షకుడట!

Update: 2022-10-28 04:22 GMT
పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు యాంకర్ అనసూయ. ఓవైపు సినిమాలు.. మరోవైపు టీవీ షోలతో బిజీబిజీగా ఉండే ఆమె.. సోషల్ మీడియాలోనూ సందడి చేసే సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికా ట్రిప్ లో ఉన్న ఆమె.. దీపావళిని కూడా అక్కడే జరుపుకుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆమె పోస్టు చేసిన ఫోటో కొత్త ఆరాకు తెర తీసింది.

ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ.. అతను తన సంరక్షకుడు.. స్నేహితుడు అంటూ పేర్కొన్న ఆమె.. 'నేను జెర్రీ అయితే తను టామ్ అవుతాడు. హ్యాపీ బర్త్ డే' అని పేర్కొంది. అతడి పేరును ఉజ్వల్ గా వెల్లడించింది.

దీంతో.. అనసూయ పోస్టు పై కొత్త ఆరా మొదలైంది. ఆమెను ఎప్పుడు ఏ రీతిలో తప్పు పడదామని చూసే వారికి కొత్త మేత దొరికినట్లైంది. సాదాసీదాగా ఉన్న ఫోటోను పోస్టు చేసినప్పటికీ.. కొందరు ఇష్టం వాచినట్టు కామెంట్స్ పెట్టారు  . ఇదిలా ఉండగా.. ఇంతకూ అతను ఎవరు? అన్న ఆరా మొదలైంది. ఈ క్రమంలో అతడి వివరాలు బయటకు వచ్చాయి.

అడవి శేష్ స్వీయ దర్శకత్వంలో హీరోగా 2013లో కిస్ అనే మూవీని తీశారు. షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదల కాలేదు. ఇందులో ఉజ్వల్ ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత అతడు మరే సినిమాలో నటించలేదు. అమెరికాలో ఉంటున్నాడు. తన అమెరికా టూర్ లో అతడిని కలిసి ఫోటో షేర్ చేసింది అనసూయ.

ఈ మాత్రం దానికే కొత్త రచ్చ షురూ కావటం గమనార్హం. తన స్నేహితుడ్ని పరిచయం చేయటం కూడా తప్పేనా? అంటూ ఆరా తీసిన వారిపై పలువురు మండిపడుతున్నారు.

అనసూయను అభిమానించేవారు.  మిగిలిన వారికి భిన్నంగా..  పార్టీలకు దూరంగా ఉంటూ.. ఫ్యామిలీకి పెద్ద పీట వేసే అనసూయను కావాలనే టార్గెట్ చేసే ప్రయత్నంలోనే ఇలాంటి కామెంట్స్ కొందరు పెడుతున్నారు .


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News