ఫోటో స్టోరి: డోస్ పెంచిన అనసూయ

Update: 2015-10-14 19:07 GMT
స్మాల్ స్క్రీన్ నుంచి జబర్దస్త్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది అనసూయ. చిన్నా చితకా కేరక్టర్స్ చాలానే వచ్చినా.. పవర్ స్టార్ పక్కన ఐటెం గాళ్ గా నటించే అవకాశం వచ్చినా.. అన్నింటినీ కాదని బాగానే విమర్శల పాలైంది. ఎట్టకేలకు నాగార్జున మరదలిగా సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇస్తూ.. తన కల నెరవేర్చుకోబోతోంది.

కానీ.. నాగ్ నటించిన సోగ్గాడే చిన్ని నాయనకు ఇంకా కష్టాలు తీరలేదు. అవుట్ పుట్ పై సంతృప్తి చెందని నాగార్జున.. ఇప్పటికే ఓసారి రీషూట్ చేయించిన సీన్లను.. మళ్లీ చిత్రీకరించమని చెప్పాడని తెలుస్తోంది. ఇఫ్పటి ట్రెండ్ చూస్తే.. ఫిబ్రవరి వరకూ మధ్యలో గ్యాప్ లేకుండా సినిమాలు క్యూ కట్టేశాయి. అంటే అప్పటివరకూ అనసూయకు వెండితెరపై మెరిసే అవకాశం లేనట్లే. అందుకే.. రేస్ లో వెనక్కు వెళ్లకుండా ఉండేందుకు.. ఫోటోషూట్ లను నమ్ముకుంది. లేటెస్ట్ గా నల్లని ట్రాన్ పరెంట్ శారీపై, వైట్ కలర్ ఫ్లవర్స్ డిజైన్ తో.. అందాలను అలా అలా ఆరబోసింది.

శారీలో ఉన్న మ్యాజిక్ ఏంటో రుచి చూపించే ప్రయత్నం చేసింది. అయినా.. చీరకట్టుతో అనసూయ ఎన్ని చిందులు వేయగలదో జనాలకు తెలీదా ఏంటి ? జబర్దస్త్ లో ఎన్ని చిత్రాలు చూపించింది.. ఎన్ని రకాల వయ్యారాలు పోయింది.? కాకపోతే ఇప్పుడు డోస్ పెంచిందంతే.
Tags:    

Similar News