తెలుగు ​యాంకర్ చెక్ బౌన్స్ కాలేదు

Update: 2017-06-14 07:09 GMT
బుల్లి తెర  స్టార్ యాంకర్లలో ఒకడైన ప్రదీప్ మాచిరాజు పై పుకార్లు ​ఒక్కసారిగా వచ్చిపడ్డాయి​. టి‌వి యాంకర్ గా ప్రొడ్యూసర్ గా ఉంటున్న ప్రదీప్ ని చెక్ బౌన్స్ కేస్ లో అరెస్టు చేశారు అని వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు అవన్ని ఒట్టి పుకారులు మాత్రమే అని తెలుస్తుంది. పదండి అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం.

గడసరి అత్త సొగసరి కోడలు తో బాగా పాపులర్ పొందిన ప్రదీప్ ఆ తర్వాత ఢీ జోడీ , కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షో తో స్టార్ యాంకర్ గా మారాడు. అప్పుడుప్పుడు సినిమాలు చేస్తూ టి‌వి షో ప్రొడ్యూసర్ గా మారిన ప్రదీప్ బ్యాంక్ అక్కౌంట్ లో సరిపడిన సొమ్ము లేకుండానే చెక్ ఇచ్చిన కేస్ లో పంజగుట్ట పోలీసు స్టేషన్ వాళ్ళు అరెస్టు చేశారని వార్తలొచ్చాయి. కానీ అసలు విషయం ఏంటి అంటే అరెస్టు చేసింది యాంకర్ ప్రదీప్ ని కాదు సీనియర్ నటుడు టి‌వి ఆర్టిస్ట్ ప్రదీప్ ని అని తెలుస్తోంది.

ప్రదీప్ ఈ గాలి మాటను క్లియర్ చేయడం తో  ఇప్పుడు అందరూ ఈ షాక్ నుండి బయటపడ్డారు. విజయవంతంగా కొనసాగుతున్న తన కెరియర్ లో ఇలాంటి వార్తలు రావడం సర్వసాధారణం అని తెలికగా తీసుకున్నాడు ఈ యాంకర్. కొంచెం   క్లారిటి లేని వార్త వల్ల వచ్చిన ఈ పరిణామం ఎంత దుమారం లేపిందో కదా. యాంకర్ ప్రదీప్ చెక్ కాదు టి‌వి యాక్టర్ ప్రదీప్ చెక్ బౌన్స్ అయ్యింది. అది కథ.​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News