నిజం పెళ్లి చూపులు కాదా?

Update: 2018-09-29 07:41 GMT
టీవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం ఛానల్స్ పడుతున్న తంటాలు అన్ని ఇన్ని కావు. రేటింగ్స్ కోసం ఎలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేయాలి అనే దాని మీద బుర్రలు బద్దలు కొట్టుకోవడంతో పాటు ఇతర బాషల్లోనో లేదా దేశాల్లోనూ సక్సెస్ అయిన రియాలిటీ షోలను స్ఫూర్తిగా తీసుకుని ఏవేవో చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాంటిదే త్వరలో ఒక లీడింగ్ పాపులర్ ఛానల్ లో మొదలు కాబోతున్న పెళ్లి చూపులు. ఇప్పుడున్న మగ యాంకర్స్ లో క్రేజ్ పీక్స్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రదీప్ దీనికి సెంటర్ అఫ్ అట్రాక్షన్. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతోంది.

కాన్సెప్ట్ సింపుల్. అమ్మాయిలను పార్టిసిపెంట్స్ గా పిలిపించి వాళ్ళు ప్రదీప్ కు తగ్గ జోడి అవుతారో లేదో డిసైడ్ చేయడం. ఇందులో రౌండ్స్ ట్విస్టులు ఎలిమినేషన్ డ్రామా వగైరా అంతా ఓ రేంజ్ లో ఉంటాయట. మరి ఫైనల్ విన్నర్ ని ప్రదీప్ నిజంగానే పెళ్లి చేసుంకుంటాడా అనే డౌట్ రావడం సహజం. ఒకవేళ చేసుకోను ఇదంతా ఉత్తుత్తి టీవీ షో అని మాట దాటేస్తారా అనే అనుమానం రావడం సహజం. నిజానికి ఈ స్వయంవరాలు పెళ్లి చూపులు ఇండియన్ టీవీకి కొత్తేమి కాదు. గతంలో ఐటెం బాంబు రాఖీ సావంత్ ఒక హిందీ ఛానల్ కోసం చేసిన ఇలాంటి ప్రోగ్రాం బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు టిఆర్పి రేటింగ్స్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. ఆఖరికి చాలా డ్రామా మధ్య తూచ్ అనేసింది అది వేరే సంగతి. ఒక కెనెడియన్ టీవీ షోలో సింహాద్రి సెకండ్ హీరోయిన్ రస్నా బేబీగా పాపులర్ అయిన అంకిత ఇలాగే పెళ్లి చేసుకుంది.

కానీ మన దగ్గర ఇలాంటి కాన్సెప్ట్ ఇదే మొదటి సారి. కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది ప్రదీప్ పెళ్లి దాకా వెళ్లకపోవచ్చనే  వినిపిస్తోంది. సరదాగా షో నడిపి మహా అయితే డమ్మీ ఎంగేజ్మెంట్ లాంటిది చేసి బై చెప్పేస్తారు అని వినికిడి. ఇది నిజమో కాదో షో నిర్వాహకులు ప్రదీప్ తో చెప్పిస్తే సరి. ప్రదీప్ అంటే ఎలాగూ పార్టిసిపెంట్స్ భారీగా వస్తారు. మరి ఇంత తతంగం నడిపి చివరికి నాకు ఎవరు నచ్చలేదు అంటే  ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో. మొత్తానికి ప్రదీప్ ఈ షోద్వారా తెలుగులో కొత్త ట్రెండ్ కి శ్రీకారం అయితే చుట్టినట్టే.
    

Tags:    

Similar News