ప్రముఖ యాంకర్ రవి ఈ రోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఒక సినిమా కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో యాంకర్ రవి ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు. సీనియర్ నటుడు చలపతి రావు చేసిన వ్యాఖ్యల విషయంలో రవిపై కూడా అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసును ఏడో తేదీకి కోర్టు వాయిదా వేసింది.
రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో వేడుక సందర్భంగా వేదికపై యాంకర్ అడిగిన ప్రశ్నకు సినీ నటుడు చలపతిరావు కొంచెం తిక్కగా సమాధాన మిచ్చారు. ఈ సినిమా ట్రయలర్ లో అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అనే క్యాప్షన్ ఉంటుంది. ఆడియో ఫంక్షన్ లో ఇదే ప్రశ్నను యాంకర్ చలపతిరావును అడిగింది. నిజంగానే అమ్మాయిలు మనశ్శాంతికి ప్రమాదమా? అని. చలపతిరావు సమాధానమిస్తూ.. అమ్మాయిలు హానికరం కాదుగానీ - పక్కలోకి పనికొస్తారు అన్నారు. ఈ సమయంలో యాంకర్ గా ఉన్న రవి సూపర్ సార్... అంటూ కామెంట్ చేశారు.
దీంతో చలపతిరావు మహిళలపై చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. అదికాస్త చినికి చినికి గాలివానగా మారింది. సినిమా ఇండస్ట్రీ - మహిళా సంఘాలు చలపతిరావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రారండోయ్ సినిమా నిర్మాతలకు ఇది తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఈ సినిమా ఆడియో వేడుకలోనే చలపతి రావు వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళా సంఘాల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.