హైదరాబాద్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు వందల సంఖ్యలో పెరుగుతుండటంతో ప్రజలు వణుకుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అయితే తాజాగా తెలుగు టీవీ యాంకర్ రవి ఇంట్లో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయినట్లు ఫేస్‌బుక్ లైవ్‌లో తెలిపాడు. "ఇక ఇటీవలే జీ తెలుగులో అదిరింది కామెడీ షో షూటింగును ప్రారంభించినట్టు రవి అన్నాడు. షూటింగ్ స్పాట్ నుంచి ఫేస్‌బుక్ లైవ్‌ను మొదలుపెట్టి నటులను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ సెట్లో చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నామని అన్నాడు. ఇంకా లాక్ డౌన్ వలన పరిస్థితి తారుమారు అయింది. ఇప్పుడు షూటింగ్ చేసే విధానంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రతీ ఒక్కరు మాస్క్ పెట్టుకొని జాగ్రత్త తీసుకొంటున్నారు. షూటింగ్ స్పాట్ లో పెద్ద పెద్ద శానిటైజర్ మెషిన్లను ఏర్పాటు చేశారు. టేక్ చెప్పినప్పుడే యాక్టర్లు మాస్కులు తీస్తున్నారు అని యాంకర్ రవి వెల్లడించారు.
అంతేగాక కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లండి. లేకపోతే ఇంట్లోనే ఉండండి. మీ అందరూ బాగుండాలని కోరుకొంటున్నాం. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి ఆరోగ్యం చేజారితే కష్టంగా ఉంటుంది" అని యాంకర్ రవి జాగ్రత్తలు చెప్పారు. మా ఫ్యామిలీ మెంబర్స్‌లో కజిన్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. లాక్‌డౌన్ తర్వాత అతడిని కలువలేదు. ఎవరైనా సరే కరోనా బారిన పడ్డారంటే ధ్యైర్యాన్ని కోల్పోవద్దు. ఫైట్ చేస్తూ ఉండండి. రోగ నిరోధక శక్తిని పెంచుకొండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని యాంకర్ రవి సలహాలు ఇచ్చాడు. చివరిగా ఈ 2020 సంవత్సరం ఘోరంగా ఉంది. దీన్ని ఏమనాలో తెలియడం లేదు. చాలామంది సినీ ప్రముఖులు చనిపోయారు. వైజాగ్‌లో గ్యాస్ దుర్ఘటన ఇలా ఎన్నో జరుగుతున్నాయి. 2020 త్వరగా ముగుస్తే బాగుండు" అంటూ యాంకర్ రవి తన అభిప్రాయాలను బయట పెట్టాడు.