ఒకప్పుడు రిక్షా బండికి మైక్ సెట్స్ కట్టుకుని.. ఫలానా థియేటర్ లో ఫలానా సినిమా ఆడుతోంతంటూ చెప్పే ప్రచారం ఇలాగే ఉండేది. కాకపోతే.. అప్పటి నుంచి రోజూ 4 ఆటలు అనే మాట మనకు అలవాటయిపోయింది. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతోంది. మల్టీప్లెక్స్ లు వచ్చాక కల్చర్ మారింది. ఇప్పుడు బాహుబలి2 పుణ్యమా అని సింగిల్ స్క్రీన్స్ లో కూడా రోజుకు ఆరు ఆటలు పడే అవకాశం చిక్కింది.
అవును.. బాహుబలి2 మూవీని సింగిల్ స్క్రీన్స్ లో కూడా రోజుకు ఆరు ఆటలు ప్రదర్శించేందుకు.. ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టికెట్ రేట్లను రూ. 200 వరకూ పెంచేందుకు అనుమతి ఇవ్వాలని బాహుబలి2 యూనిట్ కోరగా.. దీనికి అంగీకరించని ఏపీ సర్కార్.. ఎక్కువ షోస్ వేసుకోవడానికి మాత్రం అనుమతి ఇచ్చింది. అయితే.. ఈ స్పెషల్ పర్మిషన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత తొలి వారం రోజుల పాటు మాత్రానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించి రాత్రి 2.30కి ముగిసిపోయేలా ఆరు ఆటలను థియేటర్లు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టేసే వసూళ్లను సాధించేయడం ఖాయం అని ఇప్పటికే తేలిపోగా.. ఈ స్పెషల్ పర్మిషన్ తో అంచనాలకు మించిన కలెక్షన్స్ ను అందిపుచ్చుకోనున్నాడు బాహుబలి2.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/