థియేట‌ర్లు లాక్..హీరోలు జ‌నాల్లో తిర‌గాల్సిన టైమొచ్చింది!

Update: 2022-07-16 09:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్  వ్యాప్తంగా 400 థియేట‌ర్లు మూత ప‌డిన‌ట్లు మీడియా క‌థ‌నాలు వేడెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. థియేట‌ర్ల నిర్వ‌హ‌ణ భార‌మై తాత్కాలికంగా వాటిని మూసి వేసిన‌ట్లు తెలుస్తోంది. 1000 కి పైగా ఉన్న ఏపీ థియేట‌ర్లలో 400 మూత ప‌డ‌టం అంటే? ఆషామాషీ కాదు. ఇండ‌స్ర్టీకి ఇది  పెద్ద షాక్ అనే చెప్పాలి.

ఇప్పుడే ఇలాంటి స‌న్నివేశం చోటు చేసుకుందంటే హైకోర్టు ప‌రిధిలో ఉన్న ఆన్ లైన్ టిక్కెట్ విక్ర‌యాల వ్య‌వ‌హారంపై తీర్పు ప్ర‌భుత్వానికి అనుకూలంగా గ‌నుక వ‌స్తే! ప‌రిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఇంకా రాష్ర్ట‌వ్యాప్తంగా చాలా థియేట‌ర్లు మూత ప‌డే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా ఇప్ప‌టికే చాలా చోట్ల‌ సింగిల్ స్ర్కీన్ థియేట‌ర్లు నిర్వ‌హ‌ణ భార‌మై ఫంక్ష‌న్ హాల్స్ గా మారిపోయాయి.

జీవో గ‌నుక ఎగ్జిబిట‌ర్ల‌కు వ్య‌తిరేకంగా వ‌స్తే  ఆ స‌న్నివేశం పీక్స్ కి చేరుతుంది. ఇది థియేట‌ర్ల మూత వెనుక ప్ర‌ధాన కార‌ణంగా  చెప్పొచ్చు. ఇంకా విశ్లేషించాల్సిన కార‌ణాలు చాలానే ఉన్నాయి. టిక్కెట్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో కొంత కాలంగా థియేట‌ర్ ఆక్యుపెన్సీ త‌గ్గిన సంగ‌తి తెలిసిందే. దీనికితోడు ప్రేక్ష‌కులు ఓటీటీకి అల‌వాటు ప‌డిపోవ‌డం తో థియేట‌ర్ల వైపు జ‌నాలు చూడ‌టం లేద‌న్న వాద‌న వినిపిస్తుంది.

ఆ కార‌ణంగానే ఓటీటీలో సినిమా రిలీజ్ కి స్ప‌ష్ట‌మైన 50  రోజుల గ‌డువు విధించి ఓటీటీ వెయిట్ త‌గ్గేలా కొత్త ప్ర‌ణాళిక‌తో ఇండ‌స్ర్టీ ముందుకు వెళ్తోంది. రాను రాను డిజిట‌ల్ యుగం మరింత అప్ డేట్ అవ్వ‌డానికి ఛాన్స్ ఉంది. అందుకే ఇండియాలో ఇంకా డీటీహెచ్ ని అందుబాటులోకి తీస‌కురాలేదు. ఆ విధానం తీసుకురావాల‌ని క‌మ‌ల్ హాస‌న్ ఎంతో ప్ర‌య‌త్నించి చివ‌రికి రాజ‌కీయ ఒత్తిళ్ల న‌డుమ వెన‌క్కి త‌గ్గారు.

కానీ ఓటీటీ విష‌యంలో నిర్మాత‌లకి  ఇలాంటి దెబ్బ త‌గులుతుంద‌ని అంచ‌నా వేయ‌లేక‌పోయారు. స్మార్ట్ టెక్నాల‌జీకి జ‌నాలు అల‌వాటు ప‌డ‌ట‌మే థియేట‌ర్ల క‌ళాహీన‌త‌కి ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తుంది. టిక్కెట్ ధ‌ర‌లు ఆకాశ‌న్నంట‌డంతో ప్రేక్ష‌కులు సినిమా ని లైట్ తీసుకునే స్థాయికి వ‌చ్చేసారు.  ప్ర‌స్తుతం  ప్ర‌జ‌ల్లో ఉన్న ఆర్ధిక  పరిస్థితులు..అస‌మాన‌త‌లు ఎంట‌ర్ టైన్ మెంట్ పై కొంత  ప్రభావాన్ని చూపిస్తున్నాయి.  సినిమా మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబ ప్రేక్ష‌కుల‌కు భారం అవుతుంద‌ని ఇప్ప‌టికే నిపుణులు హెచ్చ‌రించారు.

వీటిని ముందుగానే అంచ‌నా వేసిన అల్లు అర‌వింద్..దిల్ రాజు...సురేష్ బాబు లాంటి నిర్మాత‌లు ముందుకొచ్చి వెంట‌నే టిక్కెట్ ధ‌ర‌ల్నిత‌గ్గించే ప్ర‌య‌త్నా చేసారు. అయినా స‌రైన ఫ‌లితాలు క‌నిపించలేదు. ఇప్పుడు ఎగ్జిబిట‌ర్లు-ప్ర‌భుత్వం మ‌ధ్య న‌లుగుతోన్న ప్ర‌తిష్టంభ‌న మ‌రింత కీల‌కంగా మారింది. మ‌రి ఇప్పుడున్న ప‌రిస్థితుల్ని ఎదుర్కోవాడం ఎలా? అంటే?  స్టార్ హీరోలు ఈ విష‌యంలో చొర‌వ తీసుకోవాల‌ని తెలుస్తోంది.

హీరోలు..ద‌ర్శ‌కులు పారితోషికాలు త‌గ్గించుకుని ఎగ్జిబిట‌ర్లు..నిర్మాత‌ల నిర్వ‌హ‌ణ‌ విష‌యంలో ఆలోచించ గ‌ల‌గాలి. థియేట‌ర్ నిర్వ‌హ‌ణ భారం అన్న‌ది ద‌శాబ్ధాలుగా తెర‌పైకి వ‌స్తోన్న వాద‌న. దీనిపై మ‌ధ్య‌ర్తిత్వం స‌వ్యంగా జ‌ర‌గ‌లేదు. దానిపై ప్ర‌ధానంగా దృ ష్టిసారించాలి.నిర్వ‌హ‌ణ భారం కాకుండా చేయాలి. మోనోప‌లి విధానాన్ని వెంట‌నే తొల‌గించ‌గ‌ల‌గాలి.

ఓటీటీ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని టిక్కెట్ ధ‌ర‌ని ప్రేక్ష‌కుడికి భారం కాకుండా చేయ‌గ‌ల‌గాలి. థియేట‌ర్ కి ప్రేక్ష‌కుడు దూరం అవుతున్నాడు కాబ‌ట్టి సినిమాని వీలైనంత ద‌గ్గ‌ర చేయ‌గ‌ల‌గాలి. అందుకోసం హీరోలు రిలీజ్ కి వారం ముందు ప్ర‌చారంలో పాల్గొంటే స‌రిపోదు. క‌నీసం నెల రోజుల  ముందునుంచైనా హీరో జ‌నాల్లో తిర‌గాలి.

కేవ‌లం ప‌త్రిక‌లు..వెబ్ మీడియా ఇంట‌ర్వూ ల‌కి  ప‌రిమితం కాకుండా ప‌రిస్థితులు అదుపులోకి వ‌చ్చే వ‌ర‌కూ హీరోలు జ‌నాల్లో తిర‌గ గ‌ల్గితే ఆ సినిమాకీ  మంచి   రీచ్ దొరుకుతుంది. సినిమాల ప‌ట్ల ప్రేక్ష‌కులు ఆక‌ర్షితులు అవ్వ‌డానికి అవ‌కాశం ఉంది. థియేట‌ర్ ఎక్స్ పీరియ‌న్స్ అందించ‌డంలో టెక్నాల‌జీ ప‌రంగా  మ‌రింత వృద్దిలోకి రావాలి. అడ్వాన్సుడ్ టెక్నాల‌జీలు అందుబాటులోకి తీసురాగ‌ల‌గాలి.

ఏపీలో చాలా చోట్ల చిన్న ప‌ట్ట‌ణాల్లో ఇంకా నాన్ ఏసీ థియేట‌ర్లు..డాల్బీ అట్మోస్ సౌండింగ్ లేని థియేట‌ర్లు చాలానే ఉన్నాయి. వాటిని బ‌డ్జెట్ ప‌రిధిలోనే రెన్నోవేష‌న్ చేయ‌గ‌ల‌గాలి.  టిక్కెట్ ధ‌ర పెంచుకోవ‌డంలో హీరోలు  చూపించిన చొర‌వ ! అదే తీరున  ప్రేక్ష‌కుడికి అవ‌గాహ‌న క‌ల్పించ‌డంలో చొర‌వ తీసుకోవాలి. ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి ప‌రిస్థితులు ఎదురైతే నిర్మాత‌లు..వాళ్ల‌కి అనుబంధంగా ఉండే సంస్థ‌లు..క‌మిటీ తాలుకా పెద్ద‌లే ముందుకొచ్చేవారు.

కానీ ఇప్పుడు  ప‌రిస్థితులు క్లిష్టంగా మారుతోన్న నేప‌థ్యంలో  హీరోలు సైంతం సీన్ లోకి రావాల్సిన పరిస్థితులు ఎదుర‌వు తున్నాయి.  థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌లో కొన్ని ర‌కాలైన మార్పులు వ‌స్తే త‌ప్ప జ‌నాలు థియేట‌ర్ కి వ‌చ్చే  ప‌రిస్థితి లేదన్నది కొంత మంది అభిప్రాయం.
Tags:    

Similar News