ఆండ్రియాతో సెల్వ రాఘవన్ న్యూడ్ సినిమా?

Update: 2017-03-05 10:03 GMT
సుచి లీక్స్ పేరుతో ట్విట్టర్లో నడుస్తున్న డ్రామా ఇప్పుడు తమిళనాట సంచలనం రేపుతోంది. ట్విట్టర్లో లక్షలాది మంది ఈ ‘సుచి లీక్స్’ కోసం సెర్చ్ చేస్తున్నారు. గాయని సుచిత్ర పేరుతో బయటికి వస్తున్న సంచలన విషయాలపై పెద్ద చర్చే నడుస్తోంది. ఆమె పేరుతో మరిన్ని సంచలన విషయాలు వస్తాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జనాలు. ఇప్పటికే కొందరు కోలీవుడ్ సెలబ్రెటీలకు సంబంధించి సుచిత్ర పేరుతో రిలీజైన  ఫొటోలు.. వీడియోలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా ఆమె లీక్ చేసినట్లుగా భావిస్తున్న మెయిల్స్ గురించి పెద్ద డిస్కషన్ నడుస్తోంది. ముందుగా దర్శకుడు సెల్వ రాఘవన్.. సింగర్ ఆండ్రియాకు పంపినట్లుగా చెబుతున్న ఒక మెయిల్ బయటికి వచ్చింది. ఆ తర్వాత ఆండ్రియా.. సెల్వ భార్య గీతాంజలికి పంపినట్లుగా పేర్కొంటున్న ఇంకో మెయిల్ లీక్ అయింది. అందులో కొన్ని సంచలన విషయాలున్నాయి.

సెల్వ రాఘవన్ తనతో ఒక సినిమా మొదలుపెట్టాడని.. దాని పేరు ‘ది ఘోస్ట్’ అని పేర్కొంది ఆండ్రియా. ఇది రొమాంటిక్ మూవీ అని.. దీని కోసం దాదాపు నగ్నంగా చూపించారని.. ఐతే సినిమా మధ్యలో ఆగిపోయిందని.. ఈ సినిమాకు సంబంధించి తాను పారితోషకం కూడా ఏమీ తీసుకోలేదని ఆండ్రియా ఇందులో పేర్కొన్నట్లుగా ఉంది. దాన్ని సరిగ్గా ఎడిట్ చేసి రిలీజ్ చేస్తే అది ఒక ఆర్ట్ సినిమాలా ఉంటుందని.. కానీ అలాగే నెట్లోకి వదిలేస్తే మాత్రం పోర్న్ సినిమాలా ప్రచారం అవుతుందని ఆండ్రియా పేర్కొంది. ఈ సినిమాను పున: ప్రారంభించాలనుకుంటే తాను పని చేయడానికి సిద్ధమని.. అలా కాని పక్షంలో ఆ వీడియో ఫుటేజిని నాశనం చేయాలని.. ఈ రోజుల్లో ఇలాంటివి లీక్ అయ్యాయంటే వైరల్ అయిపోతాయని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తానికి ఈ మెయిల్ ఎంత వరకు నిజమో కానీ.. ఇందులో ఉన్న అంశాల మీద మాత్రం ట్విట్టర్లో పెద్ద డిస్కషనే నడుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News