పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌.. అందుకే హడావుడి పెళ్లి

Update: 2018-11-16 05:28 GMT
బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ నేహా ధూపియా మరియు అంగద్‌ బేడీలు గత ఏడాది వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరి వివాహం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది. కుటుంబ సభ్యులు మినహా మరెవ్వరిని వివాహానికి పిలవక పోవడంతో పాటు హడావుడిగా వివాహం నిర్వహించడంతో అనేక అనుమానాలు తలెత్తాయి. ముఖ్యంగా నేహా ధూపియా గర్బవతి అవ్వడం వల్ల హడావుడి వివాహం అంటూ సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఆ విషయమై అంగద్‌ బేడీ క్లారిటీ ఇచ్చాడు.

అంగద్‌ బేడీ హీరోగా తెరకెక్కిన ఒక సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సందర్బంగా తన భార్య నేహా థూపియా నిర్వహిస్తున్న నో ఫిల్టర్‌ నేహా షో లో పాల్గొన్నాడు. ఈ టాక్‌ షోలో అంగద్‌ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేయడం జరిగింది. యూవీతో తన విభేదాల గురించి చెప్పిన అంగద్‌ తనను యూవీ కుక్క అన్నాడని కూడా పేర్కొన్నాడు. మా పెళ్లికి పిలవని కారణంగానే యూవీకి కోపం వచ్చిందని పేర్కొన్నాడు. ఇక తమ పెళ్లి హడావుడిగా జరగడంపై మరింత స్పష్టతను అంగద్‌ ఇచ్చాడు.

పెళ్లికి ముందు నుండే నేహా తాను ప్రేమలో ఉన్నామని, చాలా సంవత్సరాల పాటు తమ ప్రేమ కొనసాగిందని, వివాహం చేసుకోవాలని భావిస్తున్న సమయంలోనే నేహా గర్బవతి అని తేలడంతో వెంటనే వివాహానికి రెడీ అయ్యాం అంటూ అంగద్‌ చెప్పుకొచ్చాడు. వివాహం సమయంలో ఎవరిని పిలవలేక పోయాం. హడావుడిగా వివాహం చేసుకున్నాం అంటూ తేల్చి చెప్పాడు. అప్పట్లో మీడియాలో వచ్చిన పుకార్లు నిజమే అని తాజాగా అంగద్‌ చేసిన వ్యాఖ్యలతో తేలిపోయింది. ప్రస్తుతం తాము చాలా సంతోషంగా ఉన్నామని అంగద్‌ మరియు నేహా దంపతులు అన్నారు.

Tags:    

Similar News