థియేట‌ర్ పై ర‌వితేజ అభిమానుల దాడి!

Update: 2017-10-18 11:15 GMT
మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ న‌టించిన రాజా ది గ్రేట్ మూవీ కోసం ర‌వితేజ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య ఆ సినిమా నేడు విడుద‌లైంది. ర‌వితేజ క‌మ్ బ్య‌క్ మూవీగా ఈ సినిమాను అభిమానులు భావిస్తున్నారు. దీంతో, చాలా గ్యాప్ త‌ర్వాత త‌మ అభిమాన హీరో సినిమా ఫ‌స్ట్ షోను చూసేందుకు అభిమానులంద‌రూ థియేట‌ర్ల ముందు బారులు తీరారు. అయితే, చెప్పిన స‌మ‌యానికి షో వేయ‌క‌పోవ‌డంతో అభిమానులు ఆగ్ర‌హించి ఓ థియేట‌ర్ పై దాడికి దిగారు. ఆవేశంతో ఊగిపోయిన అభిమానులు ఆ థియేట‌ర్లోని ఫర్నిచ‌ర్ ను ధ్వంసం చేశారు.

సూర్యాపేట‌లోని తేజా మూవీ మ్యాక్స్ థియేట‌ర్ యాజ‌మాన్యం .....రాజా ది గ్రేట్ సినిమా బెనిఫిట్ షో టికెట్ల‌ను అధిక ధ‌ర‌కు అమ్మింది. త‌మ అభిమాన హీరో క‌మ్ బ్యాక్ మూవీ బెనిఫిట్ షో చూడాల‌న్న కోరిక‌తో వారు ఆ రేటును చెల్లించి టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే, థియేట‌ర్ వారు ముందుగా చెప్పిన‌ట్లు బెనిఫిట్ షో వేయ‌క‌పోవ‌డంతో అభిమానులు ఆగ్ర‌హించారు. థియేట‌ర్ పై దాడి చేసి ఫ‌ర్నిచ‌ర్ ను ధ్వంసం చేశారు. స‌మాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే, త‌మ‌కు బెనిఫిట్ షో - స్పెష‌ల్ షోలు ప్ర‌ద‌ర్శించేందుకు అనుమ‌తి రానందునే షో వేయ‌లేక‌పోయామ‌ని థియేట‌ర్ నిర్వాహ‌కులు చెబుతున్నారు.
Tags:    

Similar News