పురి విప్పిన నెమ‌లిలా 'ది ఘోస్ట్‌' బ్యూటీ ప‌రువాలు..!

Update: 2022-10-14 01:30 GMT
అనిఖా సురేంద్రన్.. మలయాళ సినిమాలతో బాలన‌టిగా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన 'ఎంతవాడు గానీ', 'విశ్వాసం' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమాల ద్వారానే అనిఖా త‌మిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. అయితే ఈ బాలనటి ఇప్పుడు చాలా పెద్దది అయింది. హీరోయిన్ కూడా కాబోతుంది.

అనిఖా సురేంద్ర‌న్ హీరోయిన్‌గా తెర‌కెక్కుతున్న తొలి చిత్రం 'బుట్టబొమ్మ'. సితార ఎంటర్ టైన్మెంట్స్,  ఫొర్టీన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి శౌరి చంద్రశేఖర్, టి రమేష్ ద్వ‌యం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అర్జున్ దాస్‌, సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఇటీవ‌ల మేక‌ర్స్ సినిమా టైటిల్‌ను ప్ర‌క‌టించ‌డ‌టంతో పాటు ఫ‌స్ట్ లుక్‌ పోస్ట‌ర్‌ను అధికారికంగా లాంఛ్ చేశారు.

అన్న‌ట్లు అనిఖా సురేంద్రన్ రీసెంట్ గా 'ది ఘోస్ట్' మూవీతో ప్రేక్షకులను పలకరించింది. టాలీవుడ్ కింగ్ నాగార్జున, సోనాల్‌ చౌహాన్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ ఇది. దసరా పండుగ కానుక అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ‌ స్పందన దక్కింది. కానీ అనిఖా త‌న పాత్రకు పూర్తి న్యాయం చేసి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

ఇకపోతే అనిఖా సురేంద్రన్ తాజా ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. వాస్తవానికి సోషల్ మీడియాలో అనిఖాకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ మరింత పెంచుకునేందుకు తరచూ అదిరిపోయే ఫోటో షూట్లతో కుర్ర‌కారును ఆగమాగం చేస్తుంటుంది. తాజాగా కూడా బ్లాక్ కలర్ డిజైనర్ ఫ్రాక్, మ్యాచింగ్ హై హీల్స్‌ ధరించి పురి విప్పిన నెమలి మాదిరి అందంగా దర్శనమిచ్చింది.

మతి పోగొట్టే ఆమె ప‌రువాల‌కు మరియు కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్ కు నెటిజ‌న్లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌డం లేదు. నిజంగానే అంత అందంగా అనిఖా క‌నిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే హీరోయిన్ మెటీరియల్, హాట్, ఫైర్, గార్జియస్ అంటూ కామెంట్లు మోత మోగిస్తున్నారు. మరి ఈ యంగ్ సెన్సేషన్ హీరోయిన్ గా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News