తండ్రి కొడుకులు కలిసి నటించడం అన్నది ఒక ట్రెండ్. మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ కలిసి నటించిన `ఆచార్య` త్వరలో మెగాభిమానులకు ట్రీటివ్వనుంది. కింగ్ నాగార్జున - నాగచైతన్య ఇంతకుముందు మనం లాంటి క్లాసిక్స్ లో నటించారు. బాలయ్య తన నటవారసుడు మోక్షజ్ఞ నటించనున్న ఆదిత్య 999 మ్యాక్స్ లో నటిస్తారు. వెంకీ-రానా కలిసి నటించే ప్రాజెక్ట్ సెట్స్ కి వెళుతోంది. ఇద్దరూ ఒకే వెబ్ సిరీస్ లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు.
అటు బాలీవుడ్ లో ఇలాంటి కల్చర్ మరీ ఎక్కువ. ఒక రకంగా తండ్రి - కొడుకు కలిసి నటించడం అన్నది ముంబై పరిశ్రమ నుంచి ఇంపోర్ట్ అయినదే.
తాజాగా నెట్ ఫ్లిక్స్ సినిమా కోసం ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో తన కొడుకుతో కలిసి నటిస్తున్నాడు. వెటరన్ స్టార్ అనిల్ కపూర్ ఇండస్ట్రీలోని టాప్ యాక్టర్లలో ఒకరు. అతని కొడుకు హర్షవర్ధన్ కపూర్ తన కెరీర్ లో సరైన హిట్ అందుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు.
ఇప్పుడు మొదటిసారిగా తండ్రీ కొడుకులు ఇద్దరూ `థార్` అనే నెట్ ఫ్లిక్స్ చిత్రం కోసం చేతులు కలిపారు. ఈ థ్రిల్లర్ లో ఫాతిమా సనా షేక్ ని హర్ష ప్రేమికురాలిగా చూపిస్తున్నారు. రాజ్ సింగ్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ ని అనిల్ కపూర్ ఫిల్మ్ కంపెనీ నిర్మిస్తోంది. థార్ 80ల నేపథ్యంలో సెట్ చేసిన మూవీ. తండ్రీ కొడుకులు ఒకరినొకరు ఢీకొట్టే సన్నివేశాలను అభిమానులు చూస్తారని సమాచారం.
ఇక వెబ్ సినిమాలు.. వెబ్ సిరీస్ లు ఫ్లెక్సిబిలిటీని పెంచాయి. వీటిలో క్రియేటివిటీ పరంగా ఎక్కువగా నిరూపించుకునేందుకు ఛాన్సుంది. తండ్రి కొడుకు కలిసి నటించేందుకు స్కోప్ ఇక్కడ చాలా ఎక్కువ.