రామ్ వద్దనుకున్నాడు.. ఎన్టీఆర్ వినలేదు

Update: 2017-10-18 04:27 GMT
మామూలు కథకు ఎమోషన్స్ ను జతచేసి ఎంటర్ టెయినింగ్ గా చెప్పడం డైరెక్టర్ అనిల్ రావిపూడి స్టయిల్. అతడు డైరెక్ట్ చేసిన పటాస్ - సుప్రీమ్ సినిమాల్లో కామెడీ సీన్లతో పాటు హార్ట్ టచ్చింగ్ సీన్లు కూడా బాగానే ఉంటాయి. ఇప్పుడు తాజాగా మాస్ మహారాజా రవితేజతో రాజా ది గ్రేట్ సినిమా చేశాడు. ఈ సినిమాలో రవితేజ తన కెరీర్ లో తొలిసారి అంధుడి పాత్ర చేశాడు. ఈ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన రవితేజ స్టోరీ లైన్ నచ్చడంతో విరామం తర్వాత ఫస్ట్ ఈ సినిమాకు ఓకే చెప్పాడు.

అయితే రాజా ది గ్రేట్ మూవీ హీరోగా రవితేజను అనుకోలేదని అంటున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ‘‘ఈ కథను హీరో రామ్ తో తీయాలని అనుకున్నా.. కథ కూడా అతడికి వినిపించా.. కానీ కొన్ని కారణాల వల్ల ప్రాజెక్టు ఓకే అవలేదు. పదేళ్ల క్రితం చూసిన ఓ హాలీవుడ్‌ సినిమాలో అంధుడి పాత్ర స్ఫూర్తిగా ఈ కథ రాసుకున్నా. అంతకుముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కూడా కథ వినిపించా..  అయితే అది రాజా ది గ్రేట్ సినిమా కథ కాదు. మొత్తం సినిమాలో ఎన్టీఆర్ కు 45 నిమిషాలకు సంబంధించిన స్టోరీ మాత్రమే నెరేట్ చేయగలిగాను’’ అంటూ రాజాది గ్రేట్ సినిమా వెనుక ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి.

సాధారణంగా ఒక హీరోతో తీద్దామని డైరెక్టర్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నా చాలా కారణాల వల్ల వేరే హీరోతో సెట్ అవుతుంటుంది.  ఈ మార్పు కొందరికి కలిసొస్తే.. మరికొందరికి చేదు అనుభవం మిగులుస్తుంది. చూద్దాం.. రాజా ది గ్రేట్ ఎవరికి ఎలాంటి అనుభూతి మిగుల్చుతాడో?


Tags:    

Similar News