తీసింది నాలుగు సినిమాలే. నాలుగు సూపర్ హిట్స్. ఒక డైరెక్టర్ కు ఉన్న సత్తా ఎంతో చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలు. పటాస్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి స్లో అండ్ స్టడీగా హిట్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. ఈ సంక్రాంతికి మహామహులు రంగంలోకి దిగినా కూడా… ఎఫ్2 సినిమాకే హిట్ టాక్ వచ్చింది. సెకండ్ వీక్ లో కూడా కలెక్షన్స్ నిలకడగా ఉన్నాయంటే దానికి కారణం అనిల్ రావిపూడే.
అనిల్ బలం కామెడీయే. కామెడీతో పాటు.. యాక్షన్ కూడా బాగా తీయగలడు. మొన్నటి వరకు ఈ లిస్ట్ లో వినాయక్ - శ్రీనువైట్ల ఉన్నారు. ఇప్పుడు వారిద్దరూ ఫామ్ లో లేకపోవడంతో..అనిల్ దూసుకుపోతున్నాడు. అన్నింటికి మించి అనిల్.. తన సినిమాను బడ్జెట్ లో రూపొందిస్తాడు. స్టార్ ఉన్నాడు కదా అని నిర్మాతత ఎక్కువ ఖర్చు పెట్టించే రకం కాదు. అందుకే అనిల్ సినిమాలు రిలీజ్‌కు ముందే లాభాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడే. దీంతో.. డిమాండ్ ఉన్నప్పుడే దీపంలో చమురు బాగా నింపుకోవాలనే తెలివితేటలు దండిగా ఉన్న ఈ దర్శకుడు.. రెమ్యూనరేషన్ పెంచాడట. నిన్నటివరకు సినిమాకు మూడున్నర కోట్లు తీసుకునే అనీల్.. ఇక నుంచి రూ.5 కోట్ల వరకు తీసుకోబోతున్నాడట. అనిల్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ గా ఎక్కువ ఇచ్చినా తప్పేం లేదనేది నిర్మాతల భావన.
Full View