F2: ఎగ్జైట్ అవుతున్న రావిపూడి!

Update: 2018-07-22 06:35 GMT
విక్టరీ వెంకటేష్ - మెగా హీరో వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'F2' అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఫన్.. ఫ్రస్ట్రేషన్ లను అలా 'ఎఫ్-2' టైటిల్ గా పెట్టడం తో ఈ సినిమా ఆరంభంనుండే అందరి దృష్టిని ఆకర్షించింది.  సినిమా టైటిల్ లో ఫ్రస్ట్రేషన్ ఉన్నా సెట్స్ పై మాత్రం పూర్తిగా ఫన్ ఉన్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి రెగ్యులర్ గా షూట్ లొకేషన్ నుండి అప్డేట్స్ ఇస్తున్నాడు.  వాటిలో అందరూ మంచి జోవియల్ మూడ్ లో కనిపిస్తున్నారు.  

ఇప్పటి సినిమాలకు పబ్లిసిటీ అనేది చాలా కీలకమని అందరికీ తెలిసిందే.  దాంతో ఈ సినిమాకు ఇప్పటి నుంచే మంచి హైప్ తెచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టాడు దర్శకుడు అనిల్. ఇప్పటికే వెంకీ లుంగీ గెటప్పు ఫోటోను.. మరో సారి లీడ్ యాక్టర్స్ అందరూ ఉన్న గ్రూప్ ఫోటోను ట్విట్టర్ లో నెటిజనులతో పంచుకున్న రావిపూడి ఈమధ్య ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా మరో రెండు ఫోటోలు పంచుకున్నాడు.  దీంతో డైరెక్టర్ ఊరికే ఎగ్జైట్ అయిపోతూ ప్రతిదానికి ట్విట్టర్లో అప్డేట్లు - ఫోటోలు పంచుకుంటున్నాడని కొన్ని సెటైర్ లు పడుతున్నాయి.

మరోవైపు కొంతమందేమో ఈ సినిమాలో ఫ్రస్ట్రేషన్ పేరుతో మంచి ఫన్ వర్క్ అవుట్ చేస్తున్నట్టుగా ఉన్నారని అంటున్నారు.  ఇప్పటికే డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ ను 'రేస్ గుర్రం' లో బ్రహ్మానందం క్యారెక్టర్ 'కిల్ బిల్ పాండే' రూపంలో గట్టిగా వాడి మంచి ఫలితాలు సాధించాడు.  చూస్తుంటే ఇప్పుడు మరో సారి అని రావిపూడి ఫ్రస్ట్రేషన్ పై బాగా ఫోకస్ చేసినట్టున్నాడు.  అంత ఫ్రస్ట్రేషన్ ను సరిగ్గా వాడితే డబల్ ఫన్ క్రియేట్ కావడం గ్యారెంటీనే!
Tags:    

Similar News