యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడికి డాన్సులంటే ఎంత పిచ్చో..ఆయనే బయట పెట్టిన సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ముందే ఈ విషయంపై ఓపెన్ అయ్యాడు. చిరంజీవి పాత సినిమా పాటలకు డాన్సులేసేవాడినని తన ఫ్యాషన్ ని బయట పెట్టాడు. అనీల్ ప్యాషన్ కి మెగాస్టార్ ఎంతో ముచ్చటపడ్డారు. మరి ఆ ఫ్యాషన్ ని పెద్ద తెరపైనా ఎలివేట్ చేస్తున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. `సరిలేరు నీకెవ్వరు` క్లైమాక్స్ అనంతరం శుభం కార్డు పడుతున్నప్పుడు అనీల్ డాన్సులతో రచ్చ చేసాడుట. అంతకుముందు ఓ పాట మధ్యలో స్టెప్పులతో అలరించనున్నాడుట. మరి ఆ సాంగ్ ఏది అన్నది తెరపై చూసి సర్ ప్రైజ్ అవ్వాల్సి ఉంటుందట. అంతేకాదు.. అనీల్ సిగ్నేచర్ స్టెప్పులతో కిరాక్ పుట్టిస్తాడని చెబుతున్నారు.
ఇక డాంగ్ డాంగ్ పాటకు అనీల్ ఎంతగా ఫిదా అయ్యాడో తెలిసిందే. మిల్కీ బ్యూటీ తమన్నాని రంగంలోకి దింపి డాంగ్ డాంగ్ పాటలో తనతో కలిసి డ్యాన్సులు చేసిన సంగతి తెలిసిందే. ఆ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోలో మహేష్ -తమన్నా తో కలిసి అనీల్ డాన్సులేసాడు. మరి ఆ పాటలోనే అనీల్ రచ్చను ఎడిటింగ్ చేయకుండా ఒరిజినల్ గా చూపించేస్తున్నారా? అన్నది చూడాలి. ఇక ఇంతకు ముందే ఎఫ్-2 క్లైమాక్స్ లో మెరుపు తీగలా అనీల్ కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి సూపర్ స్టార్ మహేష్ నటించిన సినిమా కావడంతో తనలో ఇంటర్నల్ ఫీల్ ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఉండొచ్చు.
దర్శకులలో హిడెన్ ట్యాలెంట్స్ ఎన్నో ఉంటాయి. ఆల్మోస్ట్ అందరూ మంచి నటులే. అయితే అరుదుగానే డ్యాన్సింగ్ ట్యాలెంట్ చూడగలం. అవకాశం ఉన్న చోట కామియోలతో దర్శకులు తెరపై కనిపించే ప్రయత్నం చేస్తుంటారు. కెమెరా వెనుక ఉన్నా.. అందరినీ ముందుడి నడిపించేది కెప్టెన్ కాబట్టి అప్పుడప్పుడు మాత్రమే అనీల్ తరహాలో డైరెక్టర్లు స్క్రీన్ మీద కనిపించే ప్రయత్నం చేస్తుంటారు. అలా చేస్తే అభిమానులకు సంతోషమే. తెర వెనక అసలు కథానాయకుడు ఎవరో ప్రేక్షకుడికి తెలియాలంటే? అప్పుడప్పుడు ఇలా తెరపైకి రావాల్సిందే.