అనిల్ రావిపూడి.. టాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్. మొదటి సినిమా పటాస్ తో కళ్యాణ్ రామ్ కి సూపర్ హిట్ ఇచ్చి వార్తల్లో నిలిచిన అనిల్ రావిపూడి.. రెండో సినిమాగా సుప్రీమ్ తీసి సాయిధరంతేజ్ తో పాటు తాను కూడా పాతిక కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిపోయాడు. దీంతో ఈ దర్శకుడి పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది.
డైలాగ్ రైటర్ గా కెరీర్ మొదలుపెట్టి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించే రేంజ్ కి చేరాలంటే.. అందులో చాలా కష్టం ఉంటుంది. అసలు ఇలా ఛాన్సులు రావడానికి ట్యాలెంట్ తో పాటు ఇండస్ట్రీలో ఓ గాడ్ ఫాదర్ అవసరం కూడా ఉంటుంది. ఇన్నేళ్లూ ఓన్లీ ట్యాలెంట్ తో అనిల్ రావిపూడి ఎదిగాడని అందరూ అనుకున్నారు. కానీ తనిప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఓ వ్యక్తి అంటూ స్వయంగా చెప్పాడు ఈ దర్శకుడు. ' తమ్ముడు చిత్రానికి దర్శకత్వం వహించారు అంకుల్ పీ ఏ అరుణ్ ప్రసాద్. ఆయన కారణంగానే నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్నా' అంటూ ట్వీట్ చేశాడు అనిల్ రావిపూడి.
పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాకి దర్శకత్వం వహించి కెరీర్ స్టార్ట్ చేసిన పీ ఏ అరుణ్ ప్రసాద్.. అదే సినిమాని తమిళ్ విజయ్ తో బద్రిగా తీసి క్రేజ్ సంపాదించాడు. తెలుగులో బ్లాక్ బస్టర్ మూవీ పవన్ కళ్యాణ్ ఖుషీని కన్నడలో సుదీప్ తో చందు అనే పేరుతో తీసి అక్కడా క్రేజీ డైరెక్టర్ అయ్యాడు పీఏ అరుణ్ ప్రసాద్. ఓ ఐదారేళ్ల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన చుట్టమే అనిల్ రావిపూడి.