విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన `ఎఫ్ 2` సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను బీచ్ సొగసుల విశాఖ నగరంలో వైజాగ్ ఉత్సవాల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ వేడుకకు ఊక వేస్తే రాలనంత మంది జనం విచ్చేశారు. ఉత్సవం ఆద్యంతం మాంచి జోష్ తో ఉర్రూతలూగించారు. అయితే విశాఖ ఉత్సవాల్లో ఈ వేడుకలు నిర్వహించడంతో కవరేజీ అంతే ఇదిగా వచ్చిందని భావించవచ్చు. ఇక వేదికపై మాట్లాడిన అనీల్ రావిపూడి - దిల్ రాజు బృందం వెంకీని తమదైన శైలిలో పొగిడేశారు. ``అయ్యో అయ్యో అయ్యయ్యో...`` వెంకీ ఎనర్జిటిక్ కామెడీ టైమింగ్ గురించి చెప్పాల్సిన పనేలేదు. ఆయన టైమింగే టైమింగు.. ఈ చిత్రంలో అద్భుతంగా నటించారాయన అని రావిపూడి అన్నారు. వెంకీ నుంచి కామెడీని ఎంత తోడితే అంతా పుడుతుందని అన్నారు. ఈ చిత్రంలో 6 పాటలు ఉన్నాయి. డిసెంబర్ 31న మీరంతా ఓ రెండు పాటలు కచ్ఛితంగా పాడుకుంటారు.. రెచ్చిపోదాం బ్రదర్.. గిర్రా గిర్రా గిర్రా తిరుగుతోంది బుర్రా.. పాటలు హైలైట్ గా ఉంటాయి.. అని రావిపూడి అన్నారు. ``ప్రతి మనిషికి నవ్వు జీవితంలో భాగం.. సంక్రాంతికి ఎఫ్ 2 చూడండి.. ఫన్ ఫ్రస్టేషన్.. అద్భుతంగా నచ్చుతాయి.. అనీ అనీల్ రావిపూడి అన్నారు.
ఇదే వేదికపై దిల్ రాజు మాట్లాడుతూ సంక్రాంతికి అల్లుల్లొస్తున్నారు .. అందరినీ కడుపుబ్బా నవ్విస్తారని అన్నారు. దర్శకుడు అనీల్ రావిపూడి కథ చెబుతున్నప్పుడు ఆద్యంతం నవ్వూతూనే ఉన్నాను. భార్యా భర్తల మధ్య ఫన్-ఫ్రస్టేషన్ కథ చెబుతున్నప్పుడే తెలుసు.. మా బ్యానర్‌లో ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుందని. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ సూపర్ హిట్స్.. అవి కమర్షియల్ సినిమాలు అయితే ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. అందరికీ నచ్చుతుంది అని అన్నారు. ఇంట్లో ఇల్లులు వంటింట్లో ప్రియురాలు - నువ్వు నాకు నచ్చావ్ వెంకటేష్ ని చూసినట్టుగా ఉంటుంది. అనీల్ రావిపూడికి మా బ్యానర్ లో వరుసగా మూడో సినిమా ఇది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్.. ఆర్య నుంచి ఎఫ్ 2 వరకూ 10 సినిమాలకు సంగీతం అందించారు.9 సినిమాలు విజయాలు అందుకున్నాయి. ఒక సినిమాకి వేవ్ లెంగ్త్ కు తగ్గట్టు పాటలివ్వడం దేవీ స్టైల్. సన్నివేశానుసారం పాటలుంటాయి.. అనీ తెలిపారు.
Full View