నూరు శాతం సక్సెస్ రేటుతో టాలీవుడ్ లో దూసుకు పోతున్న దర్శకులు అతి కొద్ది మంది మాత్రమే. వారిలో అనీల్ రావిపూడి ఒకరు. పటాస్ నుండి మొన్నటి సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు వరుసగా సక్సెస్ లు దక్కించుకుంటూ వచ్చిన దర్శకుడు అనీల్ రావిపూడి మొదటి సారి తన స్నేహితుడి కోసం సమర్పకుడిగా మారాడు. స్నేహితుడు సాయి నిర్మించిన 'గాలి సంపత్' సినిమా కు కథ మరియు మాటలు అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశాడు. అనీల్ రావిపూడి ఈ సినిమాపై చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. సక్సెస్ తో దూసుకు వెళ్తున్న అనీల్ రావిపూడికి ఈ సినిమా నిర్మాత ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది చూడాలి.
సినిమా విడుదల సందర్బంగా దర్శకుడు అనీల్ రావిపూడి సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. సినిమాలో రాజేంద్ర ప్రసాద్ పాత్ర అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశాడు. సినిమాలోని శ్రీవిష్ణు మరియు రాజేంద్ర ప్రసాద్ పాత్రలతో పాటు క్లైమాక్స్ కూడా కీ రోల్ పోషించిందని చెప్పుకోవాలి. క్లైమాక్స్ క్వాలిటీ కోసం చిన్న సినిమా అయినా ఎక్కువగా ఖర్చు చేయించి మరీ విజువల్ ఎఫెక్ట్స్ చేయించాము. ఈ సినిమా క్లైమాక్స్ నచ్చితే సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నట్లే అన్నాడు. ఎఫ్ 3 తో బిజీగా ఉన్నా కూడా ఒక మంచి కంటెంట్ ఉన్న కథను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో ఈ సినిమాను చేయించినట్లుగా చెప్పుకొచ్చారు.