కుర్రాడు ఎన్నారై లకు నచ్చడం లేదా?

Update: 2017-10-24 05:56 GMT
టాలీవుడ్ లో ప్రస్తుతం యువ దర్శకులు బాగా హిట్స్ అందుకుంటున్నారు. నేటితరం ఆడియెన్స్ పల్స్ ని తెలుసుకొని ఎటువంటి ట్రీట్ మెంట్ లాంటి సినిమా తీస్తే బావుంటుందనే విషయాన్ని గ్రహిస్తున్నారు. ఆ తరహాలో వరుసగా హిట్స్ అందుకుంటున్న దర్శకుల్లో చేరిపోయాడు అనిల్ రావిపూడి. కెరీర్ లో  కమర్షియల్ కథతో దర్శకుడిగా అవకాశం దక్కించుకోవాలంటే చాలా కష్టమే.

కానీ అనిల్ కంటెంట్ ని కరెక్ట్ గా క్యాచ్ చేస్తున్న హీరోలు అవకాశాలను ఇచ్చి హిట్స్ అందుకుంటున్నారు. పటాస్ - సుప్రీమ్ సినిమాలతో హిట్స్ అందుకున్న ఈ యువ దర్శకుడు రీసెంట్ గా రాజా ది గ్రేట్ సినిమాతో కూడా పర్వాలేదనే అనిపించుకున్నాడు. రాజా ది గ్రేట్ సినిమా మళ్లీ రవి తేజ కెరీర్ కు బూస్ట్ ని ఇచ్చిందనే చెప్పాలి. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. కానీ అమెరికా లో ఉన్న ఎన్నారై లను మాత్రం మెప్పించలేకపోయింది. ఈ ఒక్క సినిమానే కాదు. అనిల్ ఇంతకుముందు తీసిన పటాస్ - సుప్రీమ్ కూడా అక్కడ తక్కువ కలెక్షన్స్ ని మాత్రమే అందించాయి.

ప్రస్తుతం తెలుగు సినిమాలకు యూఎస్ లో మంచి రెస్పాన్స్ ఉంది. కానీ పటాస్ సినిమా 175k డాలర్లను సాధిస్తే.. సుప్రీమ్ అయితే కేవలం 65k డాలర్లను మాత్రమే రాబట్టగలిగింది. ఇక రాజా ది గ్రేట్ కూడా ఉహించినంత  స్థాయిలో డాలర్లను ఇవ్వలేదు. మొదటి వారం మొత్తం ఆ సినిమా 321k డాలర్లను మాత్రమే అందుకుంది. అనిల్ రావి పూడి కథలు కొత్తగా ఉన్నా తెరకెక్కించే విధానం మాత్రం ఇంకా రెగ్యులర్ ఫార్మాట్ లోనే ఉందని సినీ విశ్లేషకుల టాక్. అందుకేనేమో ఎన్నారై లు ఈ కుర్రాడి సినిమాలను ఇష్టపడటం లేదు.    
Tags:    

Similar News