ఇప్పుడు ఆల్రెడీ 1500 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.. త్వరలోనే 2000 కోట్లు వసూలు చేస్తుంది.. వావ్ బాహుబలి అంటూ అందరూ తొడల కొట్టేస్తున్న వేళ.. ఒక పెద్దాయన మాత్రం.. 'అసలు బాహుబలి ఏం రికార్డు కొట్టలేదు. 5 వేలు కోట్లు వసూలు చేస్తేనే రికార్డు కదా' అంటూ చెప్పుకొచ్చాడు. ఇందులో నిజంగానే నిజముందా? అసలు ఏంటీ రికార్డు గోల. లెటజ్ సీ.
అప్పట్లో 2001లో వచ్చిన ''గద్దర్ః ఏక ప్రేమ్ కథా'' సినిమా గుర్తుందా? ఈ సినిమాను అనిల్ శర్మ అనే దర్శకుడు రూపొందించాడు. ఆ తరువాత 'ది హీరో' 'అప్నే' 'వీర్' వంటి ఫ్లాపు సినిమాలను రూపొందించిన ఈ దర్శకుడు ఒక లాజిక్ చెబుతున్నాడు. ''2001లో టిక్కెట్టు రేటు 25రూపాయలు ఉన్నప్పుడు.. గదర్ సినిమా 265 కోట్లు వసూలు చేసింది. మరి ఇప్పటి టిక్కెట్ రేటునూ ఇప్పటి ద్రవ్యోల్భణం బట్టి చూసుకుంటే.. ఆ సినిమా 5 వేల కోట్లు వసూలు చేసినట్లు. ఆ లెక్కన చూస్తే బాహుబలి జస్ట్ 1500 కోట్లేగా వసూలు చేసింది. ఇంకెక్కడి రికార్డు??'' అంటూ కొంటెగా ప్రశ్నించేశాడు ఈయన.
నిజానికి అలా ఇన్ఫ్లేషన్ లెక్కల్లో చూసుకుంటే చాలా సినిమాలు అసలు రికార్డులే కొట్టినట్లు కాదు. ఇప్పటికీ ఎప్పటికీ కొన్ని పాత సినిమాలే మిగిలిపోతాయి. తెలుగులో కూడా పోకిరి సినిమా వసూళ్ళు మగధీర బాహుబలి కంటే ఎక్కువగా ఉండే ఛాన్సుందని కొందరు ట్రేడ్ పండితులు చెప్పడం విశేషం. సరే ఇంతకీ ఈ సినియర్ బాలీవుడ్ డైరక్టర్ బాహుబలి 2 పై ఎందుకు రాళ్ళేస్తున్నట్లో? ఏమీ లేదు.. ఆయన కొడుకు ఉత్కర్ష్ హీరోగా 'జీనియస్' అనే సినిమా లాంచ్ అయ్యింది. ఈ సందర్భంగా అటెన్షన్ కొట్టేయడానికి ఇలా ఎకనామిక్స్ వల్లించాడు గురుడు.