రాజ్ తరుణ్ సినిమాపై.. ప్రొడ్యూసర్ క్లారిటీ

Update: 2016-06-24 04:01 GMT
వంశీకృష్ణ దర్శకత్వంలో రాజ్ తరుణ్ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలపై ఇప్పుడో క్లారిటీ వచ్చింది. సినిమా నుంచి వంశీకృష్ణ తప్పుకున్నాడనే వచ్చిన రూమర్స్ నిజం కాదంటున్నారు నిర్మాత అనిల్ సుంకర. ప్రస్తుతం తొలిషెడ్యూల్ పూర్తి చేసుకోగా.. త్వరలోనే రెండో షెడ్యూల్ ని ప్రారంభించబోతున్నట్లు చెప్పారు.

తొలి సినిమా దొంగాట మాదిరిగానే  ఈ చిత్రం కూడా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకంగా ఉన్నాడు దర్శకుడు వంశీకృష్ణ. 'ఈ మూవీని కంప్లీట్ గా స్క్రిప్ట్ దగ్గర పెట్టుకున్నాకే ప్రారంభించాం. స్క్రిప్ట్ ప్రకారం ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉంటుంది. దీన్ని ఓ పెద్ద యాక్టర్ తో చేయించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆ పాత్రకు నటుడిని ఫైనలైజ్ చేశాక రెండో షెడ్యూల్ మొదలవుతుంది' అంటూ సన్నిహితులు చెబుతున్నారు. నిర్మాతల నుంచి వచ్చిన క్లారిటీతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే న్యూస్ రూమర్ మాత్రమే అని తేలిపోయింది.

ఇదిలా ఉంటే.. రాజ్ తరుణ్ హీరోగా మరో చిత్రాన్ని కూడా ఏకే ఎంటర్టెయిన్మెంట్స్ ప్రారంభించనుంది. 'త్వరలోనే ఈ చిత్రం కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. కొత్త డైరెక్టర్ సంజనా రెడ్డి దీనికి దర్శకత్వం వహించనుండగా.. రెండు సినిమాల షూటింగ్ లోను రాజ్ తరుణ్ ఒకేసారి పాల్గొంటాడు' అని నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. ఇదే బ్యానర్ పై రాజ్ తరుణ్ హీరోగా నిర్మితమయ్యే మూడో సినిమాకి ప్రముఖ రైటర్ వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News