బాబీ సింహా.. తెలుగులో ఇప్పటిదాకా సినిమాలేవీ చేయలేదు. కానీ తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ పేరు బాగానే పరిచయం. ఎందుకంటే ఏడాది కిందట అతడి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘జిగర్ తాండా’ సినిమాలో అతడి నటనకు గానీ జాతీయ ఉత్తమ విలన్ పురస్కారం దక్కింది అతడికి. తమిళంలో ముందు బాబీ చేసినవన్నీ కామెడీ పాత్రలే. కానీ ఈ సినిమాకు తనను తాను పూర్తిగా మార్చుకుని.. విలన్ పాత్రను అద్భుతంగా రక్తి కట్టించాడు బాబీ. అందుకే జాతీయ అవార్డుతో పాటు మరెన్నో పురస్కారాలు అతణ్ని వరించాయి. ఈ నటుడు ఇప్పుడు తెలుగులోకి కూడా అడుగుపెడుతున్నాడు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘రన్’లో బాబీనే విలన్.
రన్ ఆడియో వేడుక శనివారమే హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. బాబీ సింహా మన తెలుగువాడే అని వెల్లడించాడు. తనకీ విషయం ముందు తెలియదని.. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా బాబీ సింహానే తమది బందరు అని వెల్లడించాడని.. ఇలాంటి నటుడు మన తెలుగువాడైనందుకు గర్వించాలని చెప్పాడు అనిల్. అనంతరం బాబీ తెలుగులోనే మాట్లాడటం విశేషం. రన్.. ‘నేరం’ అనే తమిళ, మలయాళ ద్విభాషా చిత్రానికి రీమేక్. తమిళంలో పోషించిన పాత్రనే తెలుగులో కూడా చేస్తున్నాడు బాబీ సింహా. అతడి పాత్ర పేరు.. వడ్డీ రాజా. అధిక వడ్డీలకు అప్పిచ్చి.. అది తీర్చని వాళ్లను టార్చర్ చేసే పాత్ర. వయెలెంటుగా ఉంటూనే వినోదాన్ని కూడా పంచుతుంది ఈ క్యారెక్టర్. ‘రన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు బాబీ.