ఏ.ఆర్.రెహమాన్- హ్యారిష్ జైరాజ్- యువన్ శంకర్ రాజా - రధన్ అంటూ ఇలా సంగీత దర్శకుల్లో కొన్ని పేర్లు తమిళ ఇండస్ట్రీ నుంచి చాలా ప్రత్యేకంగా వినిపిస్తుంటాయి. క్రియేటివ్ బీజీఎంలతో అద్భుతమైన స్వరాలను సమకూర్చడంలో వీరంతా స్పెషలిస్టులుగా గుర్తింపు పొందారు.
నేటితరంలో అనిరుధ్ రవిచంద్రన్ కి అంతటి ట్యాలెంట్ ఉంది. అతడు ఇప్పటికే సక్సెస్ పైరంగా హై లెవల్ అందుకున్నాడు.ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ కంపోజర్లలో అనిరుధ్ ఒకరిగా కొనసాగుతున్నారు. అతను బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్నాడు. ఇక ఇదే స్పీడ్ లో ఇప్పుడు తారక్ - కొరటాల మూవీ కోసం పని చేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే అనిరుధ్ ఒక్క మాస్ సాంగ్ ని రెడీ చేసేశాడట.
సినిమా లాంచ్ సందర్భంగా విడుదల చేసిన ఒక చిన్న ప్రోమోలో బీజీఎం క్యూరియాసిటీని పెంచింది. అనిరుధ్ ఇప్పటికే ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ తో బిజీ అయ్యారు. తాజా సమాచారం మేరకు ఈ చిత్రం BGM నెవ్వర్ బిఫోర్ అనేలా యూనిక్ గా ఉండాలని తారక్ అనిరుధ్ ముందు సవాల్ విసిరారట.
దీంతో అతడు ఈ సవాల్ ని స్వీకరించి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. తారక్ కోసం ఒకటికి పది వెర్షన్లను అతడు వినిపించనున్నాడని సమాచారం.
ఎన్టీఆర్ కి కథ అందించేందుకు కొరటాల కూడా ఇలానే సవాళ్లను ఎదుర్కొన్నాడు. అతడు స్క్రిప్టును రెడీ చేసేందుకే చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఆర్.ఆర్.ఆర్ విడుదల తర్వాత తారక్ కి ఇమేజ్ పెరిగింది. పాన్ ఇండియా హీరోగా అతడు ఎదిగాడు. అందుకు తగ్గట్టే పాన్ ఇండియా కథాంశాన్ని కొరటాల ఎంచుకున్నారని గుసగుస వినిపిస్తోంది.
అనిరుధ్ లాంటి యంగ్ ట్యాలెంట్ యాడవ్వడంతో టీమ్ లో జోష్ నిండింది. ఇందులో తారక్ పాత్ర కూడా చాలా రఫ్ గా భారీ యాక్షన్ తో ఉంటుందని ఇంతకుముందు విడుదలైన లుక్ వెల్లడించింది. మోషన్ పోస్టర్ క్యూరియాసిటీని పెంచింది. దానికి తగ్గట్టే బీజీఎంని అనిరుధ్ అందిస్తున్నారట. ఒకటికి పది వెర్షన్లు విని తారక్- కొరటాల ఫైనల్ చేయనున్నారని సమాచారం.