మొదటి నుంచి కూడా అనీష్ కృష్ణ విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఆయన దర్శకత్వంలో ఇంతకుముందు వచ్చిన 'గాలి సంపత్' .. 'అలా ఎలా' సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఆయన తన తాజా చిత్రంగా 'కృష్ణ వ్రింద విహారి' సినిమాను రూపొందించాడు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 23వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్నరాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అనీష్ కృష్ణతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ ఫంక్షన్ కి అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా వచ్చాడు.
ఈ వేడుకలో అనీష్ కృష్ణ మాట్లాడుతూ .. "ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకోవలసింది నాగశౌర్య గారికి. నేను కథ చెప్పగానే మిగతా పనులన్నీ ఆయన తన భుజంపై వేసుకుని చకచకా సెట్స్ పైకి తీసుకుని వెళ్లారు. ఈ సినిమాను భుజాన వేసుకుని జనంలోకి వెళ్లడం విశేషం. సినిమాపై తనకి ఉన్న నమ్మకాన్ని జనంలో తీసుకుని రావడానికి ఆయన పాదయాత్రను చేయడం నిజంగా అభినందించదగిన విషయం. ఐరా క్రియేషన్స్ అనేది ఇప్పుడు నా హోమ్ బ్యానర్ గా మారిపోయింది. పాండమిక్ పరిస్థితులను దాటుకుని వాళ్లు ఈ సినిమాను ఇక్కడి వరకూ తీసుకుని రావడం గొప్ప విషయం.
ఈ సినిమాలో రాధిక గారు అమృతవల్లి పాత్రను పోషించారు .. ఆమె పాత్ర చాలా స్ట్రాంగ్. సినిమాలో ఆమె పాత్ర లేకపోయినా .. రాధికగారు చేయకపోయినా ఈ రోజున మేము ఇక్కడ నిలబడి ఇంత నమ్మకంగా మాట్లాడేవాళ్లం కాదని నా ఉద్దేశం.
రాధిక గారు ఈ సినిమా మొత్తానికి ఒక నిండుదనాన్ని తీసుకుని వచ్చారు. ఇక ఇప్పుడు షెర్లీ గురించి చెప్పాలి. సాధారణంగా మన సినిమాల్లో హీరోయిన్స్ పక్క రాష్ట్రాల నుంచి వస్తుంటారు. అలాంటివారి నుంచి అవుట్ పుట్ తీసుకోవడమే కష్టం. కానీ షెర్లీ న్యూజిలాండ్ కి చెందిన అమ్మాయి .. తనకి హిందీ కూడా రాదు.
అయినా తాను తెలుగు నేర్చుకుని చక్కగా డైలాగ్స్ చెప్పింది .. డబ్బింగ్ కూడా చెప్పింది. వ్రింద పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆర్టిస్టులు .. టెక్నీషియన్స్ అంతా కూడా ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లారు.
మహతి స్వరసాగర్ గారి పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. విజయ్ మాస్టర్ సిగ్నేచర్ స్టెప్స్ ఇప్పటికే బాగా వైరల్ అవుతున్నాయి. ఈ నెల 23 నుంచి థియేటర్లలో ఈ సినిమా ఉంటుంది. అద్భుతమని నేను చెప్పను .. చూసి ఎలా ఉందో మీరు చెప్పండి" అంటూ ముగించాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.