వంశీ దర్శకత్వంలో రూపొందిన ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ మూవీ రిలీజ్ కి రెడీ అయిపోతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు ఛార్ట్ బస్టర్స్ లో నిలుస్తున్నాయి. అసలు ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినపుడే విమర్శలు వెల్లువెత్తాయి. హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ కు హీరో సుమంత్ అశ్విన్ ఛాతీ దగ్గర కొలతలు తీస్తున్నట్లుగా విడుదల చేస్తున్న పోస్టర్ విమర్శలకు కారణమైంది.
అయితే.. లేడీస్ టైలర్ మూవీ గురించి తెలిసిన వాళ్లకు ఈ ఫ్యాషన్ డిజైనర్ మూవీ జోనర్ ఎలా ఉంటుందో అర్ధమవుతుంది కాబట్టి.. పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు అనీషా ఓ ఆశ్చర్యకరమైన విషయం చెప్పింది. ఆ పోస్టర్ లో అంత వల్గారిటీ ఏమీ లేదన్న ఈ భామ.. అసలు అలాంటి సన్నివేశం ఏదీ సినిమాలో చేయలేదని చెప్పడం ఆశ్చర్యకరమైన విషయం. అయితే.. తమ అభిప్రాయం చెప్పడానికి ఎవరికైనా హక్కు ఉంటుందని చెప్పిన ఈ భామ.. గ్లామర్ విషయంలో కూడా కొత్త కబుర్లు చెప్పింది.
'నేను ఈ సినిమాలో గ్లామరస్ రోల్ చేశాను. షార్ట్స్.. టీ షర్ట్స్ లో కనిపిస్తాను. విదేశాల నుంచి వచ్చిన గ్రామీణ వాతావరణంతో ప్రేమలో పడిపోయే పాత్ర. ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం దర్శకుడు వంశీ. ఈ కామిక్ డ్రామాలో చేయడం నాకు లైఫ్ టైం అఛీవ్మెంట్ లాంటింది. పాపికొండలు ప్రాంతంలో వారం రోజుల పాటు ఎలాంటి మొబైల్ నెట్వర్క్ లేని పరిసరాల్లో షూటింగ్ చేశాం. ఆ వారం మా అమ్మానాన్నలతో నాకు కాంటాక్ట్ కూడా లేదు' అని చెప్పింది అనీషా ఆంబ్రోస్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/