అనిత యాత్ర వెనుక అసలు స్టోరీ

Update: 2017-05-06 04:09 GMT
ప్రతీవారికి  విహారి యాత్రలు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. కాకపోతే అక్కడకు ఎలా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఎక్కడ ఉండాలి అనే దగ్గర కొంతమంది ఆగిపోతారు. ఇప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ లేవు అనుకోండి . ఇంటర్నెట్ పుణ్యమాని అన్నీ అందుబాటులోకి వచ్చాయి. అలాగే యాత్ర అనే ఒక ట్రావెల్ సంస్థ ఇప్పుడు చాలా సర్వీసెస్ ఇస్తోంది. ఆ క్రమంలోనే స్టార్స్ తో ట్రావెల్ చేసి అక్కడ విషయాలు స్టార్స్ తోనే చెప్పిస్తోంది కూడా.

ఇప్పుడు అటువంటి ఒక పోగ్రామ్ లో తెలుగు హింది తమిళ్ లో ఒకప్పుడు బాగానే హీరోయిన్ గా కొనసాగిన 'నువ్వు నేను' సొగసరి అనిత.. తన భర్త తో ఇండోనేషియాకు వెళ్ళి.. యాత్ర సంస్థతో తన ఆనందాన్ని పంచుకుంది. ఈ డాక్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఆమె భర్త రోహిత్ రెడ్డి పుట్టినరోజు వేడుక కూడా జరిపింది. ఈ యాత్ర డాక్యుమెంటరీలో హోటల్ గురించి అక్కడ ఫుడ్ గురించి వారి సంస్కృతి గురించి కూడా చెప్పడం జరిగింది. జకార్తా లో అనిత ఒక చిన్న షో లో కూడా పాల్గొని దాని విశేషాలు కూడా ఇందులో పొందుపరిచింది.

ఈ కాన్సెప్టు గురించి ట్రావెల్ సంస్థ ఏమంటోందంటే.. “సెలెబ్రిటీస్ ట్రావెల్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి వాళ్ళతో షూట్ చేస్తూ వాళ్ళ అనుభవాలు ఇందులో జోడించి అక్కడ చూడ తగ్గవి చెప్పుతూ ఫిల్మ్ చేస్తే వెళ్ళేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కదా అందుకే ఈ సిరీస్ ని స్టార్ట్ చేశాం అని చెప్పారు. బాగుంది వాళ్ళ ఆనందంతో వీళ్ళ వ్యాపారం. కానివ్వండి.

Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News