అరవ కుర్రాడితో అంజలి రొమాన్స్

Update: 2016-06-17 05:36 GMT
తెలుగమ్మాయి అంజలికి టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. నిజానికి అమ్మడు అక్కడ ప్రూవ్ చేసుకున్నాకే మనోళ్లు ఛాన్సులు ఇచ్చారు. టాలీవుడ్ పై అంజలికి బాగానే మనసున్నా ఆఫర్ల విషయంలో ఇక్కడి జనాలు అంతంతమాత్రంగానే ఇస్తున్నారు. అందుకే తమిళ్ పై ఏ మాత్రం పట్టు వదల్లేదు ఈ పిల్ల.

కుర్ర హీరో జై తో ఓ కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంజలి. ఇది కూడా హారర్ సినిమానే కావడం విశేషం. అయితే.. ఈ మూవీలో జై-అంజలిల మధ్య సాగే రొమాంటిక్ ట్రాక్ హైలైట్ అవుతుందని అంటున్నారు. జూలై 6న ఈ మూవీ స్టార్ట్ కానుండగా.. ఓ ఐటీ ప్రొఫెషనల్ గా అంజలి నటించనుంది. జై-అంజలి కాంబినేషన్ సెట్ కాగానే.. కోలీవుడ్ బజ్ క్రియేట్ అయింది. ఇందుకు కారణం.. రియల్ లైఫ్ లో కూడా వీళ్లిద్దరి మధ్యా రిలేషన్ నడుస్తోందనే టాక్ ఉండడమే. 'ఎంగేయమ్ ఎప్పోదమ్'(తెలుగులో జర్నీ) అనే సినిమా నుంచి వీళ్లిద్దరి మధ్యా లవ్ ఎఫైర్ నడుస్తుందనే టాక్ ఉంది. మధ్యలో బ్రేకప్ అన్నారు కానీ.. ఈ ప్రేమ కథకు బ్రేక్ పడలేదనే విషయం ఈ మధ్యనే ప్రూవ్ అయిపోయింది.

నిన్నటికి నిన్న అంటే జూన్ 16న అంజలి పాప పుట్టిన రోజు. ఈ సందర్భంగా 'హ్యాపీ బర్త్ డే అంజూ.. హావ్ ఏ బ్యూటిఫుల్ అండ్ హ్యాపీయెస్ట్ బర్త్ డే' అంటూ జై ట్వీట్ చేస్తే.. 'థాంక్యూ జే.. ఇది నాకు బెస్ట్ బర్త్ డే. నాతోనే ఎల్లప్పుడూ ఉండు' అంటూ రీట్వీట్ చేసింది అంజలి. ఈ ట్వీట్ తో చాలామందికి లవ్ ఎఫైర్ విషయంపై క్లారిటీ వచ్చేసింది. మీక్కూడా క్లారిటీ వచ్చిందిగా!
Tags:    

Similar News