ఏది నమ్మమంటావ్ అంజలి??

Update: 2017-03-28 10:18 GMT
అప్పుడే నాకు పెళ్లేంటి.. ఎందుకు పిచ్చి పిచ్చి రూమర్లు స్ర్పెడ్ చేస్తున్నారు? ఆల్రెడీ ఒక తెలుగు ప్రొడ్యూసర్ తో పెళ్ళయిపోయిందని రాశారు.. ఇప్పుడు ఇదొకటా? అంటూ ఆ మధ్యన పెదవి విరిచింది సెక్సీ తెలుగు బ్యూటి అంజలి. ఆ తరువాత ఈ రాజోలు పాప చేసిన హడావుడి చిత్రాంగద సినిమా సక్సెస్ కోసం ఏమాత్రం ఉపయోగపడలేదు. అయితే ఇప్పుడు మల్ళీ అలాంటి న్యూస్ ఒకటి వచ్చింది.

తమిళ హీరో జై తో అమ్మడు అంజలి చాలా కాలంగా లివ్-ఇన్ రిలేషన్లో ఉంటోందని తమిళ మీడియా అంతా కోడై కూసింది. అలాగే జై ఇంట్లో దోశలు వేస్తూ అంజలి కూడా అడ్డంగా దొరికేసింది. అయితే అదంతా కేవలం ఫ్రెండ్‌ షిప్ అని అంజలి కొట్టిపాడేసినా కూడా.. అదంతా ప్రేమ ఇష్క్ కాదల్ అంటూ చాలామంది చాలాసార్లు చెప్పారు. ఇక అతగాడితో పెళ్ళి ఫిక్సయ్యింది అనే మాటను అంజలి కొట్టిపాడేసినా కూడా.. ఆమె సన్నిహితులు మాత్రం వచ్చే సంవత్సరమే వారిరువురికి పెళ్లి అంటున్నారు. ఆల్రెడీ ఈ విషయం పెద్దలు కూడా చర్చించుకుని డేట్లు లాక్ చేసే పనిలో ఉన్నారట.

ఏదేమైనా కూడా పెళ్ళికి ముహూర్తం పడేవరకు అబ్బే అలాంటిదేం లేదే అనడం మనం చాలామంది దగ్గర చేశాం. త్రిష అలాగే చెప్పింది.. అమలాపాల్ అలాగే అనేసింది.. చివరకు సమంత కూడా చైతన్య గురించి సైలెంట్ గానే ఉంది. చివరకు అవన్నీ పెళ్ళిళ్ళ దగ్గరకే దారితీశాయ్. ఏమంటావ్ అంజలి? ఏది నమ్మమంటావ్?


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News