చిత్రాంగద సక్సెస్ అంటున్నారే!!

Update: 2017-03-14 08:16 GMT
తెలుగు అందం అంజలి ప్రధాన పాత్రలో.. పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో రూపొందిన మూవీ చిత్రాంగద. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాల విషయంలో.. గీతాంజలి అంటూ సక్సెస్ కొట్టిన హిస్టరీ అంజలి ఖాతాలో ఉండడంతో అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. అలాగే గతవారం భారీ చిత్రాల హంగామా కూడా లేకపోవడంతో.. అంజలి మూవీకి పెర్ఫామ్ చేసేందుకు మంచి స్కోప్ దొరికిందనే చెప్పాలి.

అయితే.. ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదన్న మాట స్పష్టమే. ప్రధానంగా ప్రమోషన్ లోపాలు ఈ చిత్రంపై బాగానే ఎఫెక్ట్ చూపించాయని చెప్పచ్చు. అయితే.. కలెక్షన్స్ పుంజుకుంటున్నాయని.. సినిమా రేంజ్ అంతకంతకూ పెరుగుతోందని చెబుతున్నారు చిత్రాంగద యూనిట్. విజయోత్సవ వేడుకలు అంటూ.. టీం అంతా కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి.. తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతోంది చిత్రాంగద టీం.

'ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు ప్రేక్షకులకు థ్యాంక్యూ. నన్ను నేను యాక్టర్ గా ప్రూవ్ చేసుకునేందుకు చిత్రాంగద అనే కేరక్టర్ ఇచ్చిన అశోక్ గారికి కృతజ్ఞతలు. బడ్జెట్ పరిమితులు చూసుకోకుండా.. అన్నింటినీ ఓపిగ్గా భరించిన నిర్మాతలకు కూడా థ్యాంక్యూ. ఇంత భారీ రిలీజ్ కు కారణమైన శివకుమార్ గారికి కూడా థ్యాంక్స్' అని చెప్పింది హీరోయిన్ అంజలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News