తెలుగమ్మాయి అంజలి పర్సనల్ లైఫ్ ఎప్పుడూ ఏదో ఒక వివాదం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ప్లానింగ్ విషయంలో చేసిన పొరపాట్లు.. కెరీర్ పై ఎలా ప్రభావం చూపుతాయనే విషయం అంజలిని చూస్తే అర్ధమవుతుంది. ఇప్పుడీ భామ తన అనుబంధంపై కూడా పెదవి విప్పేసింది.
కొన్ని వారాల క్రితం తమిళ హీరో జై.. అంజలి కోసం లవ్ దోశ వేయడం.. ఇద్దరూ కలిసి ఫోటోకు పోజ్ ఇవ్వడం చూశాం. రేపు రిలీజ్ కానున్న చిత్రాంగద మూవీ కోసం ప్రమోషన్స్ లో పాల్గొంటున్న అంజలికి.. జై తో రిలేషన్ గురించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ ప్రశ్నలను సావధానంగా విన్న అంజలి.. 'నేను ఇంకా ఏదీ కన్ఫామ్ చేసుకోలేదు' అని చెప్పేసింది. త్వరలో ఏమైనా కన్ఫామ్ చేసే అవకాశాలున్నాయా అని అడిగితే.. సైలెంట్ గా ఉండిపోయింది తప్ప ఏం మాట్లాడలేదు.
మళ్లీ అవే ప్రశ్నలు వచ్చేసరికి మాత్రం.. 'నేను పెళ్లి విషయంలో ఏ మాత్రం తొందరపడ్డం లేదు. ప్రస్తుతం తమిళ్ లో నాకు వరుసగా సినిమాలు ఉన్నాయి. నేను మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నా. ఇప్పటికిప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలు వదిలేయాలని అనుకోవడం లేదు' అని చెప్పింది. ఇక రేపు రిలీజ్ అవుతున్న చిత్రాంగద మూవీతో.. మరోసారి భయపెట్టేందుకు అంజలి రెడీ అయిపోయింది. గతంలో గీతాంజలి అంటూ సోలో హిట్ కొట్టిన అనుభవం ఉండడం.. ఈ భామకు కలిసొచ్చే విషయం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/