తెలుగు నటి అయినా.. ముందు కోలీవుడ్ లో గుర్తింపు సంపాదించి, తర్వాత టాలీవుడ్ లోనూ హీరోయిన్ గా వెలుగుతోంది అంజలి. ఇప్పుడు అంజలిని లీడ్ రోల్ లో తీసుకుని సినిమా చేయడమంటే.. తెలుగు - తమిళ్ రెండు భాషల్లోనూ తీసేయచ్చనే రేంజ్ లో ఉంది ఈ భామ. ప్రస్తుతం చిత్రాంగద అనే మూవీ ఇలాగే ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది. ఈ సినిమా కోసం అంజలి రెండు భాషల్లోనూ ఓ పాట పాడ్డం విశేషం.
'అమెరికాలో షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ పాటను అంజలి హమ్ చేయడం విన్నాను. ఆమె గొంతు చాలా బాగుంది, తన స్వరంలో మెలోడీ కూడా ఉంది. అందుకే పాట పాడే ఆలోచన చెప్పాను. కానీ తను ఒప్పుకోలేదు. తర్వాత ఈ ఆలోచనను మ్యూజిక్ డైరెక్టర్స్ సెల్వగణేష్ - స్వామినాథన్ లకు చెప్పాను' అన్నాడు డైరెక్టర్ అశోక్. దీంతో అంజలికి అసలు విషయం చెప్పకుండానే.. రికార్డింగ్ స్టూడియోకి పిలిచారట.
తీరా స్టూడియోకి వచ్చాక ఒకసారి పాడేందుకు ట్రై చేయమని బలవంతం చేయడంతో.. మొహమాటంగానే పాడిందట అంజలి. అయితే, ఆ పాట చాలా బాగా రావడంతో.. అంజలి కూడా ఆశ్చర్యపోయిందని చెబుతున్నాడు డైరెక్టర్. అప్పటికే వేరే సింగర్ తో పాడించిన ఆ పాట షూటింగ్ కూడా పూర్తయిపోవడంతో.. అంజలికి ట్యూన్ ముందుగానే తెలుసు. అందుకే పాట పాడ్డం సింపుల్ అయిపోయింది. అలా అంజలి సింగర్ అవతారం ఎత్తింది.