వీడియో : ప్రియుడితో పబ్లిక్‌ గా నటి లిప్‌ లాక్‌

Update: 2019-04-26 01:30 GMT
హిందీ సినిమా ఇండస్ట్రీలో మరియు బుల్లి తెర ఇండస్ట్రీలో రియల్‌ లవ్‌ స్టోరీస్‌ అనేవి చాలా కామన్‌ గా చూస్తూనే ఉంటాం. ప్రేమించుకోవడం, విడిపోవడం అనేది చాలా రెగ్యులర్‌ గా బాలీవుడ్‌ లో జరుగుతూనే ఉంటుంది. కొన్నాళ్ల క్రితం బుల్లి తెర నటి అంకిత లోఖండే మరియు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పూత్‌ లు ప్రేమించుకున్న విషయం తెల్సిందే. ఇద్దరి ప్రేమ చాలా దూరం వెళ్లింది, పెళ్లి కూడా చేసుకుంటారని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఇద్దరు విడిపోయారు. సుశాంత్‌ ఆ సమయంలోనే వెండి తెరపైకి వెళ్లగా అంకిత బుల్లి తెరకే పరిమితం అయ్యింది.

సుశాంత్‌ తో విడిపోయిన తర్వాత బిలాల్‌ పూర్‌ కు చెందిన ఒక వ్యాపారవేత్తతో ఈ అమ్మడు ప్రేమాయణం సాగిస్తుందని ప్రచారం జరిగింది. ఆ వార్తలపై ఆమద్య స్పందిస్తూ నిజమే అని, అయితే అతడు ఎవరు, ఏంటీ అనే పూర్తి వివరాలను త్వరలోనే వెళ్లడిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. ఆమె అప్పుడు చెప్పినట్లుగానే తాజాగా ఒక ఫ్రెండ్‌ పెళ్లిలో తాను ప్రేమిస్తున్న వ్యక్తి గురించి చెప్పకనే చెప్పింది. వ్యాపారి విక్కీ జైన్‌ తో ఈ అమ్మడు ప్రేమలో మునిగి తేలుతోంది.

తాజాగా వీరిద్దరు కలిసి హాజరు అయిన పెళ్లిలో తెగ సందడి చేశారు. ఆ సమయంలోనే విక్కీ జైన్‌ కు ముద్దులు కూడా పెట్టింది. పబ్లిక్‌ గా - అందరు చూస్తుండగా - ఇద్దరిని వీడియోలు తీస్తున్నారని తెలిసి కూడా అంకిత అతడి లిప్స్‌ పై ముద్దు పెట్టింది. ఇంత పబ్లిక్‌ గా ఆమె ముద్దు పెట్టిన నేపథ్యంలో ఇద్దరు కూడా త్వరలోనే పెళ్లి చేసుకోవడం ఖాయం అంటున్నారు. అయితే ఇటీవలే మణికర్ణిక చిత్రంతో అంకిత బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌ లో అవకాశాలు దక్కితే కాస్త సమయం తీసుకుని పెళ్లి చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి పబ్లిక్‌ గా ముద్దు పెట్టడంతో గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న పుకార్లకు అంకిత చెక్‌ పెట్టినట్లయ్యింది.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News