ఒకప్పుడు ఆడియో సక్సెస్ ను ప్లాటినం డిస్క్ ఫంక్షన్స్ జరుపుకుంటూ సెలబ్రేట్ చేసుకునే వారు. కానీ ఇప్పుడు యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ ను బట్టి ఆడియో యొక్క సక్సెస్ ను సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున దేవి శ్రీ ప్రసాద్ యొక్క ఆడియో ఆల్బమ్స్ యూట్యూబ్ లో సత్తా చాటుతున్నాయి.
గత రెండు మూడు సంవత్సరాలుగా తెలుగు సినిమాల యొక్క సంగీతాన్ని థమన్ మరియు దేవి శ్రీ ప్రసాద్ లు శాసిస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలు అంటే వీరిద్దరు మాత్రమే సంగీత దర్శకులుగా కనిపిస్తున్నారు. ఒక్కటి రెండు మినహా ప్రతి ఒక్క స్టార్ హీరో సినిమాలకు కూడా వీరి సంగీతం వినిపిస్తుంది.
పుష్ప సినిమా యొక్క సంగీతం కు అంతర్జాతీయ స్థాయిలో ఆధరణ లభించింది. దాంతో మొదటి 100 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకున్న తెలుగు ఆల్బమ్ గా పుష్ప నిలిచిన విషయం తెల్సిందే. దాంతో దేవి శ్రీ ప్రసాద్ క్రేజ్ మళ్లీ విపరీతంగా పెరిగింది.
పుష్ప తర్వాత మళ్లీ కాస్త గ్యాప్ తీసుకుని వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ బీట్స్ తో కుమ్మేశాడు. చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్లుగా ప్రతి ఒక్క సాంగ్ ను కూడా ఊర మాస్ ట్యూన్స్ తో భలేగా దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశౄడు. మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా బాస్ పార్టీ అంటున్నారు.
బాస్ పార్టీ మాత్రమే కాకుండా అన్ని పాటలు కూడా మంచి ఆధరణ దక్కించుకుంటున్నాయి. దాంతో తక్కువ సమయంలోనే వాల్తేరు వీరయ్య యొక్క మ్యూజిక్ ఆల్బమ్ యూట్యూబ్ లో ఏకంగా వంద మిలియన్ ల వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి.
వాల్తేరు వీరయ్య సినిమాలోని బాస్ పార్టీ పాట ఏకంగా 50 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుని ఇంకా కూడా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ఆ తర్వాత పూనకాలు లోడింగ్ ఏకంగా 20 మిలియన్ ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇతర పాటలు కూడా మినిమంగా పది మిలియన్ ల వ్యూస్ ను రాబట్టి మొత్తం గా వంద మిలియన్ ల క్లబ్ లో చేరింది. దీంతో దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన సత్తా చాటినట్లు అయ్యింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.